దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తరువాత అత్యంత సన్నిహితంగా ఉండేది మహేష్ తో మాత్రమే అని అంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘ఖలేజా’ ఫ్లాప్ అయినా తిరిగి తాను మహేష్ తో మరో సినిమాను తీస్తాను అంటూ అనేకసార్లు ఓపెన్ గానే చెప్పాడు త్రివిక్రమ్. ఈవిషయాలను మహేష్ కూడ ఓపెన్ గానే అంగీకరించాడు. 
త్రివిక్రమ్‌తో త్వరలో మహేష్ బాబు మూవీ
అయితే ఆతరువాత మారిపోయిన పరిస్తుతులలో మహేష్ కొరటాల శివకు సన్నిహితంగా మారిన నేపధ్యంలో మహేష్ తన దృష్టిని అంతా కొరటాల పై పెట్టడంతో త్రివిక్రమ్ దూరం జరిగాడు అన్న గాసిప్పులు ఉన్నాయి. దీనికితోడు త్రివిక్రమ్ కూడ మహేష్ సినిమా కథల గురించి ఆలోచించకుండా మిగతా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ ప్రస్తుతం జూనియర్ తో తాను తీస్తున్న ‘అరవింద సమేత’  తరువాత అల్లు అర్జున్ సినిమా గురించి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
సినిమా రంగంలోకి
దీనితో ఇక ఇప్పట్లో మహేష్ త్రివిక్రమ్ ల మూవీ ఉండదు అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఇదిచాలడు అన్నట్లుగా ఒక ప్రముఖ కంపెనీ మహేష్ తో లేటెస్ట్ గా తీసిన యాడ్ లో త్రివిక్రమ్ ను తప్పించి కొరటాలను పెట్టుకోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. ప్రముఖ కంపెనీ ‘అభిబస్’ కు బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ ఉన్న నేపధ్యంలో గతంలో ఈ కంపెనీకి సంబంధించిన ఒక యాడ్ ను త్రివిక్రమ్ మహేష్ తో తీసాడు. 
koratala shiva opened up on his new movie
అయితే ఇప్పుడు ఇదే కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ యాడ్ లో కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటించాడు. దీనితో యాడ్స్ చిత్రీకరణ విషయంలో కూడ మహేష్ త్రివిక్రమ్ ను తప్పించి కొరటాలకు అవకాశాలు ఇస్తున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనితో మహేష్ త్రివిక్రమ్ ల మధ్య ఏమిజరిగింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: