తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపధ్యంలో ప్రస్థుత తరం హీరోలు తాము నటించే సినిమాల ఎంపికలో రెండు రాష్ట్రాల ప్రజల అభిరుచిలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంత క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అన్ని జిల్లాలలోను వేల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
geetha govindam first single inkem inkem inkem kaavaale released
అయితే ఆంధ్రా ప్రాంతంలో తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి విజయ్ తన లేటెస్ట్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ లో అనుసరిస్తున్న వ్యూహాలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా తొండంగి గ్రామంలో జరుగుతోంది. ఈసినిమా కథ అంతా కాకినాడ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని సమాచారం. 
vijay devarakonda taxi wala teaser Latest 2018 - Sakshi
ఈసినిమాలో విజయ్ దేవరకొండ కాకినాడలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నారు. ఈమూవీలో విజయ్ ను కొంత రెబల్ గా చూపించడానికి కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న యువకుడుగా చూపెడుతూ అనేక సన్నివేశాలలో ఒకనాటి కమ్యూనిస్ట్ నేతల ఫోటోలను వాడుకుంటారని తెలుస్తోంది. 

అంతేకాదు ఈసినిమాలో విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్స్ అన్నీ తూర్పు గోదావరి జిల్లా యాసలో ఉంటాయని తెలుస్తోంది. దీనితో విజయ్ తూర్పు గోదావరి జిల్లా యాస పై పట్టు సాధించడానికి గోద్దవారి జిల్లాల భాషను ఒక ప్రత్యేకమైన ట్యూటర్ ద్వారా నేర్చుకుంటున్నాడని టాక్. ఈసినిమా కూడ విజయ వంతం అయితే తాను తెలుగువారికి సంబంధించిన ఇరు రాష్ట్రాల ప్రాంతానికి చెందిన హీరోని అని ప్రమోట్ చేసుకునే విధంగా విజయ్ అనుసరిస్తున్న వ్యూహాలు ప్రస్తుతం టాప్ హీరోలకు కూడ ఆశ్చర్యం కలిగిస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: