సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు మహర్షి టైటిల్ పెట్టారు. ఈరోజు మహేష్ బర్త్ డే సందర్భంగా నిన్న సాయంత్రమే మహర్షి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఇక కొద్ది నిమిషాల క్రితం మహేష్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. చేతిలో ల్యాప్ టాప్ తో మహేష్ స్టైలిష్ వాక్ చేస్తూ ఎనర్జిటిక్ గా కనిపించాడు.


మహర్షిగా మహేష్ లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా చెక్ షర్ట్, గడ్డం లుక్ అబ్బో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ మహర్షి కొత్త అనుభూతిని కలిగించడం ఖాయమని చెప్పొచ్చు. ఈ సినిమా టైటిల్ టీజర్ గురించి ఆడియెన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. మహర్షిగా మహేష్ అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు.

సినిమా టీజర్ లో దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ సర్ ప్రైజ్ లుక్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సిని ప్రియులను మరింత ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. 


2019 ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా మహేష్ కు మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉంది. సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. పూజా హెగ్దెతో పాటుగా సమ్మోహనం భామ అదితి రావు కూడా ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: