అతి పెద్ద భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైన ‘శ్రీనివాస కళ్యాణం’ ఓవర్సీస్ టాక్ బయట పడింది. అమెరికాలోని పలు ప్రాంతాలలో ఈసినిమాను చూసిన తెలుగు ప్రేక్షకులు ఈమూవీ పై డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. ఈసినిమా కథ ఒక సింపుల్ స్టోరీ మాత్రమే అని భారీ అంచనాలు లేకుండా ఈసినిమాను చూడమని ఓవర్సీస్ ప్రేక్షకులు సలహాలు ఇస్తున్నారు.
దిల్ రాజు సొంతంగా
ఈసినిమా చూసిన వారికి ఫస్ట్ హాఫ్ ఎవరేజ్ అనిపించినా సెకండ్ హాఫ్ బాగుందని కొందరు అభిప్రాయ పడుతోంటే మరికొందరు గ్రాండ్ వెడ్డింగ్ సెలేబ్రేషన్స్ చూడాలనుకుంటే ‘శ్రీనివాస కళ్యాణం’ చూడమని కామెంట్స్ చేస్తున్నారు. మంచి కుటుంబ కథా చిత్రంగా కనిపిస్తూ పాటలు లొకేషన్స్ సినిమాటోగ్రఫీ ప్రకాష్ రాజ్ రోల్ బాగున్నా ఎక్కడో కథలో లోటు కనిపిస్తూ శ్రీకాంత్ అడ్డాల సినిమాను చూస్తున్నట్లుగా ఒక రొటీన్ సినిమా ఫీలింగ్ కలిగిందని మరి కొందరి భావన. 
ఆంధ్రలో
ఈమూవీకి స్టోరీ సింపుల్ గా ఉండటం మరొక మైనస్ అని అంటున్నారు. పూర్తిగా సినిమాను చూస్తున్నంతసేపు మూవీలో దిల్ రాజ్ పెట్టిన ఖర్చు కనిపిస్తోంది కానీ ఎటువంటి టిపికల్ ట్విస్ట్ లు లేకపోవడంతో ఈసినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఒక కొత్త ఫీలింగ్ కలగలేదని ఓవర్సీస్ టాక్. 
పాజిటివ్ బజ్
అయితే ఈమూవీ ఫ్యామిలీస్ కు బాగా కనెక్ట్ అయినా యూత్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చెప్పడం కష్టం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ టాక్ ఇలా వస్తున్న నేపధ్యంలో ఈమూవీ కేవలం మల్టీ ఫ్లేక్స్ ఆడియన్స్ కు నచ్చే సినిమాగా మారుతుందా అని అనిపించడం సహజం. ఏది ఎలా ఉన్నా ఇది చూడతగ్గ మూవీ అని ఓవర్సీస్ ప్రేక్షకుల జడ్జిమెంట్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: