సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే కానుకగా ఈరోజు మహేష్ 25వ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వదిలారు. మహర్షి సినిమా టైటిల్ తో వస్తున్న మహేష్ ఈ మేకోవర్ ఫ్యాన్స్ కే కాదు సిని ప్రియులకు షాక్ ఇచ్చింది. రిషి లుక్ లో మహేష్ సిక్స్ ప్యాక్ తో అదరగొట్టాడని చెప్పొచ్చు. ఇక తన స్టైలిష్ వాక్ ప్రత్యేకంగా అనిపించింది.


ఇక ఈ సినిమా టీజర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో యూట్యూబ్ లో ట్రెండ్ అవుంది. అంతేకాదు ట్విట్టర్ లో కూడా మహేష్ మహర్షి టీజర్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మహేష్ ఈ బర్త్ డే చాలా స్పెషల్ తన కెరియర్ లో 25వ సినిమా ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు.


అందుకే మహేష్ ఫ్యాన్స్ ఈరోజు వాట్స్ అప్ నిండా మహేష్ తోనే నింపేస్తున్నారు. వాట్స్ అప్ స్టేటస్ లో కూడా మహేష్ ఫ్యాన్స్ హంగామా కొనసాగుతుంది. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ మహేష్ ఒక్కడే అని చెప్పడం లో సందేహం లేదు. ముఖ్యంగా వాట్స్ అప్ లో మహేష్ కు బర్త్ డే విషెష్ తెలిపడం క్రేజీగా మారింది.


వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న మహేష్ 25వ సినిమా మహర్షి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. దేవి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: