నలుగురికి నచ్చినది..నాకలే నచ్చదురో..నరులెవరూ తిరగనిదీ ఆ రూట్లో నే నడిచెదరో అంటూ తనదైన వెరైటీ స్టైల్ తో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలిచే నటి శ్రీరెడ్డి.  ఓ వైపు పోలీసులు ‘కికి’ ఛాలెంజ్ డేంజర్ అంటూ హెచ్చరికలు చేస్తున్నా..పలువురు సెలబ్రెటీలకు వార్నింగ్ ఇస్తున్నా  ‘కికి’ ఛాలెంజ్ చేస్తూ..హాట్ డ్రెస్ తో హాట్ హాట్ గా డ్యాన్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.  మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని తెగ హడావుడి చేసిన శ్రీరెడ్డి రిసెంట్ గా కోలీవుడ్ నటులు, దర్శకులపై కూడా సంచలన కామెంట్స్ చేసింది. 

దాంతో అక్కడి వారంతా సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో కూల్ అయ్యింది.  తాజాగా ఈ అమ్మడు ‘కికి’ ఛాలెంజ్ తో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ మధ్య సోషల్ మీడియాలో సంచలనం అవుతున్న కికి ఛాలెంజ్‌కు సంబంధించిన ఓ వీడియో పెట్టి శ్రీరెడ్డి షాకిచ్చింది.  అయితే ఈ వీడియోలో కికి ఛాలెంజ్ చేసిన యువతి సేమ్ శ్రీరెడ్డికి దగ్గర పోలికలతో ఉండటంతో అందరూ శ్రీరెడ్డే అనుకుంటున్నారు.

కానీ ఈ వీడియోలో ఉన్నది శ్రీరెడ్డి కాదు. ఫారెన్ అమ్మాయ్ చేసిన కికి ఛాలెంజ్ వీడియోను ‘ఓ మై గాడ్.. సో సెక్సీ’ అంటూ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: