టాలీవుడ్ లో హీరోలకు అభిమానులు మాములుగా ఉండరు. తమ హీరో ను అవతలి వారు ఏదైనా అంటే అస్సలు ఒప్పుకోరు. సోషల్ మీడియా లో చుక్కలు చూపిస్తారు.అయితే గూఢచారి  హీరోయిన్ మీద మహేష్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. గూఢచారి సినిమా చాలా బాగుందని ట్వీట్ చేశాడు మహేష్. అడివి శేషుతో పాటు నటీనటులందరి పెర్ఫార్మెన్స్ బాగుందని మెచ్చుకున్నాడు.

Image result for mahesh babu

మహేష్ ట్వీట్ కు కృతజ్ఞతగా 'థ్యాంక్ యు' అని రిప్లయ్ ఇచ్చింది శోభిత. ఇక్కడే మహేష్ హార్డ్-కోర్ అభిమానులు హర్ట్ అయ్యాయి. రెస్పెక్ట్ ఎక్కడంటూ శోభితను ఓ రేంజ్ లో ఆడేసుకోవడం మొదలుపెట్టారు. మహేష్ కు రిప్లయ్ ఇచ్చేటప్పుడు కేవలం థ్యాంక్స్ అంటూ రిప్లయ్ పెడితే సరిపోదట. థ్యాంక్ యు మహేష్ బాబు గారు అనో.. లేక థ్యాంక్ యు సూపర్ స్టార్ అనో.. రిప్లయ్ ఇవ్వాలట. ఊరికే థ్యాంక్స్ చెప్పి వదిలేయడానికి అక్కడున్నది సాధారణ వ్యక్తికాదు, మహేష్ అని అభిమానుల ఫీలింగ్. 

Image result for mahesh babu

కానీ థ్యాంక్స్ చెప్పడంలోనే ఓ గౌరవం ఉంది. ఆ విషయాన్ని మహేష్ అభిమానులు మరిచిపోయారు. ప్రస్తుతానికైతే ఈ ట్వీట్ కు సంబంధించి శోభితపై మహేష్ ఫ్యాన్స్ ఆన్ లైన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. మొత్తమ్మీద టాలీవుడ్ హీరోల వీరాభిమానుల గురించి శోభితకు మొదటి సినిమాకే ఓ చేదు అనుభవం ఎదురైంది. ఇకపై ఆమె మరింత జాగ్రత్తగా ట్వీట్స్ పెడుతుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: