ఎవరికైనా బర్త్ డే అంటే ఓ ఏడాది నెత్తిన పడుతుంది. బాడీ ఫిట్నెస్ లోనూ తేడా వస్తుంది. మొత్తంగా ఎన్నో చేంజింగ్స్ వచ్చేస్తాయి. అదేంటో మహేష్ విషయంలో మాత్రం అంతా రివర్స్. ఒక్కో పుట్టిన రోజుకూ పదేళ్ళు వెనక్కు వెళ్ళిపోతున్నాయి. ఇది అబద్దం అయితే మహేష్ లేటేస్ట్ టీజర్ మహర్షి  చూడండి, మీరే ఒకే అంటారు.


పాతికేళ్ళ కుర్రోడు :


మహర్షి టీజర్లో మహేష్ పాతికేళ్ళ కుర్రోడిలా కనిపించి ఫాన్స్ కి షాక్ ఇచ్చేశాడు. కాలేజి స్టూడెంట్ గా టిప్ టాప్ గా నడచుకుంటూ వస్తూంటే సూపర్ స్టార్ లేడీ ఫాన్స్ గుండెలు గుభేల్మంటున్నాయి. హాండ్ సం హీరో గా మహేష్ ఈ టీజర్ లో చించేశాడంటున్నారు.


ఎమెట్టి పెంచారో :


అదేదో పాత సినిమా పాటలా మహేష్ ని ఏమెట్టి పెంచారో కదా పేరెంట్స్.  గ్లామర్ అంటే నేనే అంటూ దూసుకువస్తున్నాడు. ఎక్కడా తగ్గడంలేదు సరికదా మూవీ మూవీకి డబల్ గ్లామర్ తో యూత్ హీరోలకే కేక పుట్టిస్తున్నాడు. మహేష్ డాడీ, అప్పటి సూపర్ స్టార్  క్రిష్ణ గారు ఎపుడూ అంటూండేవారు. మీ అందం వెనక సీక్రెట్ ఏంటి అని మీడియా అడిగితే. మంచి మనసు తో ఉండడమే అని.


ఆ తండ్రి క్వాలిటీస్ అన్నీ అచ్చు గుద్ది పుచ్చుకున్న మహేష్ దీ తెల్లని, చల్లని మనసు, అందుకే ఆయనలో ఇంతటి అందం. హీ మాన్ అంటే మహేషే మరి. బర్త్ డే బాయ్ మహేష్ మరిన్ని సక్సెస్ లు కొట్టాలని  కోరుకుంటూ...


మరింత సమాచారం తెలుసుకోండి: