ఎట్టకేలకు మహేష్ బాబు అభిమానులు  ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. మహర్షి సినిమా లో మహేష్ ఫస్ట్ లుక్ చూసి అభిమానులు సంభర పడుతున్నారు. అయితే కొంత మంది దీని మీద భిన్న అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. బయటకు అహో.. ఒహో అని ట్వీట్ లు వేస్తున్నా, భరత్ అనే నేనుతో పోల్చుకుంటే అంత బాలేదని వినిపిస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు గ్లామర్ లో ఓ హుందా, ఓ లెవెల్ వుంటుందని, అది మహర్షి లుక్ లో మిస్ అయిందని కాస్త గట్టిగానే వినిపిస్తోంది.

Image result for mahesh bharat ane nenu

అసలు మహేష్ కు గెడ్డంపెట్టడం ఎందుకని, ఆ డార్క్ చెక్స్ షర్ట్, గెడ్డం వల్ల లుక్ నీరసంగా అనిపిస్తోందని కొందరి కామెంట్. ప్రతీసారి మహేష్ ఫస్ట్ లుక్ అంటే ఏదో ఒకటి పట్టుకుని నడచిరావడం తప్ప వేరుకాదని, అయితే పుస్తకం, లేదంటే బ్యాగ్, కాదంటే ల్యాప్ టాప్ అని, మరోలా ట్రయ్ చేయడం లేదని ఇంకొందరి కామెంట్.

Image result for mahesh bharat ane nenu

అలా అయినా కూడా శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ ఇలా ఏ సినిమాలోనూ ఫస్ట్ లుక్ కు ఢోకాలేదని, కానీ ఈసారి మాత్రం ఛేంజ్ అనిచెప్పి, మహేష్ గ్లామర్ తగ్గించేసారని టాక్ వినిపిస్తోంది. ఎవరి కామెంట్ ఎలావున్నా మహర్షి లుక్ మీద మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఫిదాగా వున్నారు. ట్విట్టర్ లో నిన్న అర్థరాత్రి నుంచి మార్నింగ్ వరకు చేసిన హడావుడి ఇంతాఅంతా కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: