తెలుగు పరిశ్రమ లో హీరోలా అభిమాన గణం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తమ తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్పని సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ట్రోలింగ్, హంగామా  మొదల పెడతారు. తమ హీరోను ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఒప్పుకోరు. అయితే తాజాగా పూజా హెగ్డే మహేష్ అభిమానుల చేతిలో బలై పోయింది.  మహేష్‌ కొత్త సినిమా 'మహర్షి' ఫస్ట్‌ లుక్‌ విడుదలయ్యింది. ఆ లుక్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, అందులో 'రుషి' పాత్రధారి అయిన మహేష్‌కి శుభాకాంక్షలు తెలిపింది పూజాహెగ్దే.

Image result for pooja hegde

ఈ క్రమంలో 'మహేష్‌ సర్‌' అని పూజాహెగ్దే సంబోదించలేదని మహేష్‌ అభిమానులు కారాలూ మిరియాలూ నూరేస్తున్నారు సోషల్‌ మీడియాలో. అంతేనా, 'హ్యాపీబర్త్‌డే టు మహేష్‌' అనే ట్యాగ్‌లైన్‌ జోడించలేదనీ గుస్సా అయ్యారు.  కొద్ది రోజుల క్రితమే 'గూఢచారి' సినిమా బావుందని మహేష్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తే, సింపుల్‌గా 'థ్యాంక్స్‌' చెప్పిందని 'గూఢచారి' ఫేం తెలుగమ్మాయ్‌ శోభిత ధూళిపాళ్ళపై బూతుల దండకం అందుకున్నారు మహేష్‌ అభిమానులు.

Image result for pooja hegde

'సర్‌' అనడం నేర్చుకోమని క్లాస్‌ తీసేసుకున్నారు. నిన్న మొన్నటిదాకా పవన్‌కళ్యాణ్‌ అభిమానుల పైత్యం సోషల్‌ మీడియాలో చూశాం. ఇప్పుడు మహేష్‌ అభిమానులు ఆ 'అభిమాన పైత్యాన్ని' పరాకాష్టకి తీసుకెళ్ళిపోతున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ని 'ఎన్టీవోడు' అనేవారు. మెగాస్టార్‌ చిరంజీవి అయితే, 'నన్ను చిరు అని పిలిస్తేనే నాకు ఎక్కువ ఇష్టం ' అని చెబుతుంటారు. ప్రభాస్‌ని ఎవరన్నా 'డార్లింగ్‌' అని పిలిస్తే తెగ హ్యాపీ ఫీలయిపోతాడు. 'గారు, సర్‌'  అని ఆయా సినీ ప్రముఖుల్ని సంబోధించాలా.? వద్దా.? అన్నది ఆయా వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి వుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: