మహేష్ పుట్టినరోజు సందర్భంగా నిన్న విడుదలైన అతడి లేటెస్ట్ మూవీ మహర్షి సినిమాకు సంబంధించిన టీజర్ లుక్ పై కొన్ని ఊహించని కామెంట్స్ వస్తున్నాయి. బయటకు మహేష్ అభిమానులు ఈమూవీ టీజర్ అదేవిధంగా మహేష్ లుక్ చాల బాగుంది అని మెచ్చుకుంటున్నా లోలోపల ఈ టీజర్ పై అదేవిధంగా మహేష్ లుక్ పై పెదవి విరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
mahesh babu maharshi movie first look is out
మహర్షి టీజర్ ‘భరత్ అనే నేను’ టీజర్ స్థాయిలో లేదని అదేవిధంగా మహేష్ గ్లామర్ లో హుందా మిస్ అయిందని విమర్శలు వస్తున్నాయి. అసలు ‘మహర్షి’ కోసం మహేష్ కు గడ్డం ఎందుకు పెట్టారో అర్ధం కావడం లేదని ఆ గడ్డం వల్ల మహేష్ లుక్ కు అదనంగా వచ్చిన క్రేజ్ ఏమాత్రం లేదని కొందరు విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ పుస్తకం పుచ్చుకుని కనిపిస్తే ఆమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి అలాగే మహేష్ ను ‘మహర్షి’ లో మహేష్ ల్యాప్ టాప్ పుచ్చుకుని స్టైల్ గా నడిచినంత మాత్రాన అది కొత్త లుక్ అవుతుందా అంటూ మరికొందరు మహేష్ లుక్ ను టార్గెట్ చేస్తున్నారు.అంతేకాదు మహేష్ గత సినిమాలు అయిన ‘శ్రీమంతుడు’ ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ ఇలా ఏ సినిమాలోనూ ఫస్ట్ లుక్ కు ఢోకాలేదని కానీ ఈసారి మాత్రం ఛేంజ్ అనిచెప్పి మహేష్ గ్లామర్ తగ్గించేసారని అంటూ మహేష్ అభిమానులే లోలోపల మధన పడుతున్నట్లు టాక్.
A still from Maharshi teaser, featuring Mahesh Babu. YouTube screengrab
అయితే ఇది అంతా చాలామంది మహేష్ వ్యతిరేకులు మహేష్ అభిమానుల పేరిట చేస్తున్న విమర్శలు అనీ మహేష్ ‘మహర్షి’ లుక్ అభిమానులకు మాత్రమే కాకుండా అందరికీ బాగా నచ్చిందని ఈమూవీకి సంబంధించిన యూనిట్ వర్గాలు ఈవిమర్శలను తిప్పి కొడుతున్నాయి. మహేష్ నిన్నటితో 43 సంవత్సరాల వయస్సు రావడంతో ఇంకా మహేష్ ను 23 సంవత్సరాల వయస్సు ఉన్న స్టూడెంట్ లా చూపెడితే మహేష్ అభిమానులకు తప్పించి అందరికీ నచ్చుతాడా అన్న అనుమానాలు మహేష్ ‘మహర్షి’ లుక్ పై చాలామంది వ్యక్తపరుస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: