మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిరంజీవి ‘సైరా’ కు సంబంధించి ఇప్పుడు మెగా కాంపౌండ్ నుండి లీక్ అవుతున్న ఫీలర్ మెగా అభిమానులకు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలను కూడ ఆశ్చర్యపరుస్తోంది. ‘సైరా’ మూవీలో అల్లు అర్జున్ ఒక అతిథి పాత్ర చేయడం ఖరారు అయిందని దీనికి సంబంధించిన ప్రాధమిక చర్చలు దర్శకుడు సురేంద్ర రెడ్డి చిరంజీవిల మధ్య ప్రస్తుతం జరుగుతున్నాయని వార్తలు హడావిడి చేస్తున్నాయి. 
cinematographer ravi varman out from chiranjeevi's syra narasimha reddy project
తెలుస్తున్న సమాచారం మేరకు ‘సైరా’ లో అల్లు అర్జున్ నటించబోయే పాత్ర గతంలో అతడు ‘రుద్రమదేవి’ సినిమాలో నటించిన గోన గన్నారెడ్డి పాత్ర కంటే చాల పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్‌ లో చిత్రీకరణ జరుపుకుంటున్న కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ తరువాత బన్నీ చిరంజీవిలు నటించే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని వార్తలు నినిపిస్తున్నాయి. 
Sye Raa film poster.jpg
ఇప్పటికే ఈమూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నుంచి తమిళ నటుడు విజయ్ సేతుపతి వరకు చాలామంది ప్రముఖులు ఈచిత్రంలో నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీలో అల్లు అర్జున్ కూడ చేరితే ‘సైరా’ కు మరింత క్రేజ్ ఏర్పడుతుందని మెగా కాంపౌండ్ ఈపదకం రచించినట్లు టాక్. గతంలో చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ లో ఒక అతిథి పాత్ర చేయాలని అల్లు అర్జున్ ప్రయత్నాలు చేసినా అప్పట్లో అది సాధ్యపడలేదు. 
Amitabh bachchan look in Narasimha Reddy
అయితే బన్నీ ఆనాటి కల ఇప్పుడు ఇలా ‘సైరా’ లో తీరుతోందని అనుకోవాలి. దీనికితోడు గత కొంత కాలంగా అల్లు అర్జున్ మెగా అభిమానులకు దూరం అవుతున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇలాంటి వార్తలకు చెక్ పెట్టడానికి ఈవ్యూహాన్ని చిరంజీవి అరవింద్ లు అనుసరిస్తున్నారనుకోవాలి. ఈవిశాయానికి సంబంధించిన అధికారక ప్రకటన మరికొద్ది రోజులలలో మెగా కాంపౌండ్ నుండి ఉంటుందని అంటున్నారు. అప్పటి వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: