ఆ మద్య ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన నటి తారా చౌదరి తర్వాత కంటికి కనిపించకుండా పోయింది.  తాజాగా సిని హీరో రాజశేఖర్ కి తనకు మద్య ఎలాంటి సంబంధాలు లేవు అని...తనపై వస్తున్న వార్తలు అన్నీ రూమర్లు అంటూ మరోసారి వార్తల్లో నిలిచింది.  గతంలో తెలుగు రాష్ట్రాలను ఊపేసిన తారా చౌదరి పేరు తాజాగా మరోమారు తెరపైకి వచ్చింది.  ఆ మద్య తారా చౌదరికి రాజశేఖర్ కి మద్య ఏవో సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. 

కాగా, ఈ విషయంపై స్పందించిన తారా చౌదరి తనకు నటుడు రాజశేఖర్ కి మద్య ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది.  ఇండస్ట్రీలో హీరో రాజశేఖర్ ఓ మంచి భర్త అని..మంచి తండ్రి అని ఎలాంటి వివాలు లేని నటుడు అని..ఆయన నటించిన ‘మా అన్నయ్య’ సినిమా తనకు బాగా నచ్చిందని పేర్కొంది. హైదరాబాద్‌లో ఓసారి షూటింగ్ సమయంలో రాజశేఖర్‌ను కలిసి ఈ సినిమా గురించి చెప్పానని తెలిపింది.

హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో తాను నివసించే ఫ్లాట్ పక్కనే మరోటి ఖాళీగా ఉంటే చూసేందుకు రాజశేఖర్, జీవిత వచ్చారని, అలా వారితో తనకు ముఖ పరిచయం ఏర్పడిందని స్పష్టం చేసింది. రాజశేఖర్ చాలా మంచి వ్యక్తని పేర్కొన్న తార బయట ఎవరెవరో ఏవేవో అనుకుంటారని, వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదని పేర్కొంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: