కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆరెక్స్ 100. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అశోక్ రెడ్డి నిర్మించారు. కార్తికేయ, పాయల్ రొమాన్స్ యూత్ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసింది. రావు రమేష్, రాంకీలు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు.


పాయల్ అందాలతో ఫిదా అయిన ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. 3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా పాతిక కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమా తర్వాత క్రేజీ ఆఫర్స్ సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది. నిర్మాత అశోక్ రెడ్డి అజయ్ భూపతికి ఓ అద్భుతమైన కారుని గిఫ్ట్ గా అందించాడట.


ఆరెక్స్ 100 పాత బైక్ తో వచ్చి అదిరిపోయే కారు సొంతం చేసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ఒకటి ఏర్పడింది. ఊహించిన దానికన్నా సినిమా విజయం అందుకుంటే ఆ డైరక్టర్ కు నిర్మాత కాని, హీరో కాని కారుని గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఆరెక్స్ 100 సినిమా బాగా లేకుంటే ఊరికెళ్లి గొడ్లు కాస్తా అన్న అజయ్ భూపతి ఈ సినిమాతో తన సత్తా చాటాడు.


అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేందుకు కాస్త ఇబ్బంది పడిన మాట వాస్తవమే కాని అతను ఓ రియల్ స్టోరీని తీసుకుని ఇలా చేయడం గొప్ప విషయమే అని చెప్పాలి. సినిమాకు వచ్చిన కలక్షన్స్ తో స్టార్స్ కూడా షాక్ అయ్యారు. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: