చాల సంవత్సరాల క్రితం గుణశేఖర్ దర్శకత్వం వహించిన అల్లు అర్జున్ ‘వరుడు’ సినిమా పై ఎలాంటి సెటైర్లు పడ్డాయో ఇప్పుడు మళ్ళీ అంతటి స్థాయిలో దిల్ రాజ్ ఎన్నో ఆశలు పెట్టుకుని నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ పై పడుతున్నాయి. పెళ్ళి యొక్క విశిష్టతను నేటితరం ప్రేక్షకులకు చెప్పే విధంగా భారీ అంచనాలతో తీసిన ఈమూవీ అత్యంత దారుణమైన పరాజయాన్ని చూడటం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

ఈమూవీకి బయటకన్నా సోషల్ మీడియాలో భయంకరమైన నెగిటివ్ టాక్ నడుస్తోంది. వాస్తవానికి గతంలో పెళ్లి కాన్సెప్ట్ తో తీసిన ‘మొగుడు’ ‘శశిరేఖ పరిణయం’ లేటెస్ట్ గా వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమాలు పరాజయం చెందినా ‘శ్రీనివాస కళ్యాణం’ గ్యారెంటీ హిట్ అన్న ప్రచారం జరిగింది. 
Srinivasa Kalyanam Live update
ఆ భారీ అంచనాలను అందుకునే కథ లేకపోవడంతో ఈమూవీకి ఇంత భయంకరమైన నెగిటివ్ టాక్ వచ్చి ఉంటుంది అని విశ్లేషకుల అభిప్రాయం. ఇది ఇలా ఉండగా ఈసినిమా చూడటానికి నిన్న ధియేటర్స్ కు వెళ్ళిన చాలామంది అక్కడ ధియేటర్స్ వద్ద ఉన్న వాతావరణం చూసి షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ధియేటర్స్ ముందు తోరణాలు కట్టి పందిళ్ళు వేసి మేళతాళాలు ఏర్పాటు చేయడంతో ఆసినిమా ధియేటర్ లో ‘శ్రీనివాస కళ్యాణం’ మూవీకి బదులు ఎదో పెళ్లి జరుగుతోంది అని భావించి కొందరు సినిమా టిక్కెట్ కౌంటర్ వద్దకు వెళ్ళకుండానే వెనక్కు తిరిగి వెళ్లిపోయినట్లు వార్తలు కూడ వస్తున్నాయి.  
srinivasa-kalyanam Movie review
అయితే ఈ హడవిడిని చూసి మరికొందరు ఆశ్చర్యపడి అసలు ధియేటర్ లో ఏమిజరుగుతోంది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రేక్షకులకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసినట్లు సమాచారం. ఈతతంగం అంతా ప్రేక్షకులను సినిమా ధియేటర్ లోకి ఆహ్వానించడానికి దిల్ రాజ్ చేసిన హడావిడి అని తెలిసి కథలేని సినిమాకు ఇంత హడావిడి ఏమిటి అంటూ జోక్స్ వేసుకున్నట్లు సమాచారం. ఏమైనా శ్రీనివాస కళ్యాణం దిల్ రాజ్ కు ఊహించని షాక్ ఇచ్చింది అనుకోవాలి      
 



మరింత సమాచారం తెలుసుకోండి: