తెలుగు ఇండస్ట్రీలో అల్లరి చిత్రంతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ ‘సుడిగాడు’తర్వాత ఒక్క సక్సెస్ కూడా లేకుండా సతమతమవుతున్నాడు.  ఇక కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ‘అందాల రాముడు’చిత్రంతో హీరోగా మారిన సునీల్ కి కూడా మంచి సక్సెస్ లు లేకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు.  తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'సిల్లీ ఫెలోస్' . ఈ చిత్రం టైటిల్ విషయంలో ఆ మద్య కాస్త తర్జన భర్జన జరిగిందట. 
Image result for sunil allari naresh
సుడిగాడు లాంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ‘సిల్లీ ఫెలోస్’తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తయారయ్యారు.  దాదాపు ఈ చిత్రానికి సంబంధించిన పనులు అన్నీ పూర్తి అవడంతో ప్రమోషన్ కోసం రంగంలోకి దిగారు. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తాజాగా దర్శక నిర్మాతలు ప్రకటించారు. 

అయితే ఈ చిత్రం హిట్ కావడం ఇద్దరు కమెడియన్లకు చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది.  ప్రస్తుతం సునీల్ కమెడియన్ గా యూటర్న్ తీసుకొని రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.  కాగా, అల్లరి నరేష్ ప్రిన్స్ మహేష్ బాబు-పైడిపల్లి వంశి కాంబినేషన్ వస్తున్న ‘మహర్షి’ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: