ఈ మద్య కొంత మంది లీకు వీరులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.  ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్ ఎంత గోప్యంగా ఉంచుదామన్నా..లోకేషన్ లీక్ తో  తమ అభిమాన హీరో ఇలా ఉండబోతున్నారా అనుకుంటున్నారు అభిమానులు.  దాంతో సినిమాపై క్యూరియాసిటీ కూడా తగ్గిపోతుంది.  అయితే షూటింగ్ సెట్స్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా సినిమాకు సంబంధించిన ఫోటోలు లీక్ అవుతున్నాయి. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాకి లీకులు పెద్ద సమస్యగా మారాయి.
అరవింద సమేత వీర రాఘవ
ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోస్ బయటకుల లీకైన సంగతి తెలిసిందే.  తాజాగా టీజర్ లీక్ అవ్వడం చిత్ర బృందానికి పెద్ద షాకిచ్చినట్లయింది. ఎన్టీఆర్ కారు డ్రైవ్ చేస్తున్నట్లు ఉన్న ఈ వీడియోలో పక్కన నాగబాబు కూడా ఉన్నారు.  లీకైన ‘అరవింద సమేత వీర రాఘవ' టీజర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Image result for ntr aravinda sametha photo leaker
తాజాగా  ఆగస్టు 15న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ మెంట్ వచ్చిన నేపథ్యంలో   అంతకంటే ముందు నుండే ఎడిటింగ్ రూమ్ నుండి టీజర్ ఎలా బయటకు వచ్చినట్లు భావిస్తున్నారు.  ఈ విషయంపై త్రివిక్రమ్ చాలా సీరియస్ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్‌కు జోడిగా పూజా హగ్దే నటిస్తుండగా, సునీల్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: