ఈ మద్య తెలంగాణలో గ్రీన్ చాలెంజ్ పై మంచి స్పందన వస్తుంది.  సినీ, రాజకీయ ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నారు.  తాజాగా ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా మూడు మొక్క‌లు నాటి హ‌రిత స‌వాల్‌ని ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, నిర్మాత దిల్ రాజు, టీటీడి ఛైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ల‌కి స‌వాల్ విసిరారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటామని తెలిపారు. మానవాళి మనుగడ కోసం ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ విసిరిన హరిత ఛాలెంజ్‌లో భాగంగా తలసాని ఛాలెంజ్‌ని స్వీకరించి పూర్తిచేశారు. మ‌నుషుల మ‌నుగ‌డ కోసం ప్ర‌తి ఒక్క‌రు చెట్లు నాటాలి.

హరితహారం పేరుతో సీఎం చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటాం. భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ అందించే బాధ్య‌త మ‌న‌మీదే ఉంది. ఇందుకోసం ప్ర‌తి ఒక్క‌రు మొక్క‌లు నాటాల‌ని తల‌సాని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని తలసాని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: