రకుల్ ప్రీత్ సింగ్ బ్యూటీతో యూత్ ని ఓ రేంజిలో పడేసే అయస్కాంతం. సినిమాతో సంబంధం లేకుండా తన అందాలతో కుర్ర కారు మతి పోగొడుతుంది. యువ హీరోలంతా ఆమె కొంగు చుట్టూ తిరిగి హిట్లు కొట్టిన వారే. ఆ భామతో జోడీకి ఎందరో సై అంటున్నా సెలెక్టెడ్ గానే సైన్ చేస్తూ వస్తోంది. లేటేస్ట్ గా ఆమె ఓ బంపర్ ఆఫర్ కొట్టేసిందని టాలీవుడ్ టాక్. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా దాదాపుగా కన్ ఫాం అంటున్నారు.


అచ్చం శ్రీదేవిలా :


శ్రీదేవి వెండి తెర దేవత. ఆమెను ఆరాధించని తెలుగు ప్రేక్షకుడు, సినిమా ప్రేమికుడూ ఉండరు. ఈ మధ్యనే మనలను విడిచివెళ్ళిన శ్రీదేవి అలా తిరిగి వస్తే ఎంత బాగుండు అన్నది ప్రతి వారు అనుకుంటారు. శ్రీదేవి బయోపిక్ తీయాలని కూడా కోరుకుంటున్నారు. అయితే అలాంటి కల చాలా  తొందరగానే నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఆ అతిలోక సుందరిని మరో మారు వెండి తెరపై తిలకించి పులకించి పోయే రోజు దగ్గరలోనే ఉంది.


నందమూరి బయోపిక్ లో చాన్స్:



అన్న నందమూరి తారకరాముడి బయోపిక్ లో చాన్స్ రకుల్ ను వెతుక్కుంటూ వచ్చిందని టాక్. నందమూరి అందగాడితో శ్రీదేవికి సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరూ కలసి వెండి తెరపై వెన్నెలలు పండించారు. దజన్ కి పైగా చిత్రాలలో శ్రీదేవి ఎంటీయార్ సరి జోడీ అనిపించుకుంది. మరి బయోపిక్ లో శ్రీదేవి పాత్ర కూడా చాల కీలకంగా ఉందంట. ఎంటీయార్ తో తొలి కాంబినేషన్ వేటగాడు లో ఆకు చాటు పిందె తడిసే పాటలో శ్రీదేవిని ఎవరూ మరచిపోలేరు.


అలాంటి సన్నివేశాలు కొన్ని ఈ బయోపిక్ లో చిత్రీకరించబోతున్నారు. రకుల్ శ్రీదేవిగా మెరిస్తే బాలయ్య నాన్న నందమూరిని ఆవాహన చేసుకుంటున్నాడు. సో. మరో మారు ఆ వాన పాట తెలుగు జనం చూసేందుకు రెడీ అయిపోవచ్చు. తొందరలోనే రకుల్ న్యూస్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు ఎంటీయార్ మూవీ టీం సిధ్ధంగా ఉంది.
 



మరింత సమాచారం తెలుసుకోండి: