తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే అందరూ కలెక్షన్స్ గురించి మాట్లాడకుంటారు. భారీ ఓపెనింగ్స్ , హిట్ టాక్ వచ్చిన కొన్ని సార్లు నిర్మాత కు లాభాలు రానీ పరిస్థితి దీనికి చాలా కారణాలు ఉంటాయి. అయితే ఇప్పడూ మహర్షి సినిమా విషయం చూస్తుంటే అసలు లాభాలు ఎవరికీ రావని అర్ధం అవుతుంది. అంటే ఈ సినిమా కు నిర్మాతలు ఒకరు కాదు ఏకంగా ముగ్గురు.

Image result for mahesh babu

 అంటే లాభాలు వస్తే పంచుకుంటే తిలాదానం తలా పిడికిడు అన్నట్లు వుంటుంది వ్యవహారం. వంశీ పైడిపల్లి సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ అని టాక్ వుంది. ఊపిరి సినిమా అంత హిట్ అయినా నిర్మాతకు మిగిలింది లేదు. ఇప్పుడు కూడా మహేష్ సినిమాకు ఆన్ పేపర్ వేసుకున్న బడ్జెట్ అక్షరాలా 120 కోట్లు. మహేష్, డైరక్టర్ రెమ్యూనిరేషన్, పబ్లిసిటీతో కలిపి. దీనికి ఓ రూపాయి ఎక్కువే అవుతుంది కానీ, తగ్గదు. మరి సినిమా టర్నోవర్ ఎంత రావచ్చు?

Image result for mahesh babu

భరత్ అనే నేను ఫుల్ హైప్ వచ్చిన సినిమా, సూపర్ కాంబినేషన్. దాని టర్నోవర్ నే అంతాకలిపి 140 కోట్లు. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రేంజ్ లో వుంటుంది కానీ, మరీ దాన్ని దాటేస్తుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే సీడెడ్, నైజాం, వెస్ట్ తదితర ఏరియాల్లో లెక్కలు ట్రేడ్ సర్కిళ్లకు తెలుసు. అందువల్ల ఇప్పుడు భరత్ అనే నేనును మింజి బిజినెస్ చేస్తుందా అన్నది అనుమానం.


మరింత సమాచారం తెలుసుకోండి: