‘గూఢచారి’ సూపర్ సక్సస్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి అడవి శేషు పై ఉంది. నటుడుగా మాత్రమే కాకుండా రచయితగా మారి ఒక డిఫరెంట్ కథను క్రియేట్ చేసిన ఈహీరో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ గా మారాడు. ఒకవైపు అనేకమంది అడవి శేషు పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటే దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ ఇతడి పై చేసిన ఘాటైన విమర్శలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.
ఫస్ట్ కాపీ
ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి ఈషాకింగ్ కామెంట్స్ చేసాడు. అడవి శేషు తనను వాడుకుని వదిలేసాడు అంటూ సంచనలన వ్యాఖ్యలు చేసాడు ఈనిర్మాత. తాను 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నానని ఎంతోమంది గొప్ప వ్యక్తులతో తాను సన్నిహితంగా మెలిగానని అంటూ అడవి శేషు తనను అవమాన పరిచిన విధానాన్ని వివరించాడు. 
Adivi Sesh
‘గూఢచారి’ సినిమా నిర్మిస్తున్నప్పుడు అడవి శేషు తనవద్దకు వచ్చి అంకుల్ నాకు ఒక సహాయం కావాలి అంటూ తాను తీస్తున్న సినిమాలో తనను ఒక గెస్ట్ రోల్ చేయమన్నాడని అయితే తనకు నటన రాదు అని చెపుతున్నా బలవంత పెట్టి తన చేత ఆపాత్ర చేయించిన విషయాన్ని బయటపెట్టాడు తమ్మారెడ్డి. ఆతరువాత తాను ఆఅతిధి పాత్రలో నటించి తన డబ్బింగ్ కూడ పూర్తి చేసిన తరువాత ఆమూవీ ఫినిష్ అయిన తరువాత ఫస్ట్ కాపీ తనకు చూపెడతాను అంటూ అడవి శేషు ఆప్యాయంగా మాట్లాడిన సందర్భాలను వివరించాడు.
అంత ఒళ్ళు బలుపా
అయితే ఆసినిమా పూర్తి అయి ఆమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సక్సస్ మీట్ ఇలా అన్ని ఫంక్షన్స్ పూర్తి అయినా కనీసం తనకు ఆఫంక్షన్స్ కు సంబంధించిన ఇన్విటేషన్ కూడ రాకపోవడం తనను ఆశ్చర్య పరిచింది అంటూ ఈవిషయాలు అన్నీ అడవి శేషు ఇగో ను బయటపెట్టాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు తమ్మారెడ్డి. అంతేకాదు తాను ఎవరి వద్దకు వెళ్ళి సినిమా పాత్రలు అడుక్కునే స్థితిలో లేనని తన లాంటి వారితోనే ఇలా ప్రవర్తిస్తున్న ఈహీరో మరో రెండు హిట్స్ తగిలితే ఎలా మారిపోతాడో తెలియడంలేదు అని అంటూ అహంకారంతో వ్యవహరించే వ్యక్తులు ఎవ్వరూ ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలబడలేరు అని తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: