‘శ్రీనివాస కళ్యాణం’ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో మరో నాలుగు రోజులలో విడుదల కాబోతున్న ‘గీత గోవిందం’ కు లైన్ క్లియర్ అయింది. మన ఇరు రాష్ట్రాలలో ఈసినిమాను ఎన్ని ధియేటర్స్ లో కావాలనుకుంటే అన్ని ధియేటర్స్ లో విడుదల చేసుకుని భారీ ఓపెనింగ్స్ రాబట్టుకునే పరిస్థితికి మార్గం ఏర్పడింది.

ఆగష్టు 15న విడుదల కాబోతున్న ఈమూవీకి సరైన పోటీని ఇచ్చే సినిమాలు ఏమీ ఆగష్టు నెలాఖరు వరకు లేకపోవడంతో రెండు వారాలు బాక్స్ ఆఫీసును కలక్షన్స్ తో షేక్ చేసే అవకాశం విజయ్ దేవరకొండకు లభించింది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి పాటలకీ ప్రోమోలకు వస్తున్న స్పందనతో ఈమూవీకి అత్యంత భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అన్న మాట వినిపిస్తున్నాయి. 

దీనికితోడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ మ్యానియా నడుస్తున్న నేపధ్యంలో ఈమూవీ గ్యారెంటీ హిట్ అన్న ప్రచారం జరుగుతోంది. అయితే అనూహ్యంగా ఈమూవీని ఒక నెగిటివ్ సెంటిమెంట్ వెంటాడుతోంది అంటూ ఇండస్ట్రీలో కొందరు కామెంట్ చేస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఈసినిమాకు దర్శకత్వం వహించిన పరుశురామ్ కు ఉన్న నెగిటివ్ ట్రాక్ రికార్డు ఈమూవీకి అనుకోని శాపంగా మారుతుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

దీనికి కారణం ఈ దర్శకుడు ఇప్పటి వరకు తీసిన 5 సినిమాలలో ఏఒక్కటి చెప్పుకోతగ్గ విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పటివరకు ఇతడు దర్శకత్వం వహించిన ‘యువత’ ‘ఆంజనీయులు’ ‘సోలో’ ‘సారోచ్చారు’ ‘శ్రీరస్తూ శుభమస్తూ’ ఇలా అన్ని సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద చతికల పడ్డాయి. అయితే పరుశురామ్ పట్ల అభిమానంతో అల్లు అరవింద్ ఇతడి చేతిలో విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరోను పెట్టి ‘గీత గోవిందం’ సినిమాను చేసాడు. ఈమూవీకి ఇప్పటి వరకు పాజిటివ్ టాక్ రన్ అవుతున్నా అనుకోకుండా ఈసినిమా విడుదల అయిన తరువాత ఊహించని విధంగా పరుశురామ్ నెగిటివ్ సెంటిమెంట్ ఈసినిమాకు శాపంగా మారుతుందా అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. దీనితో పరుశురామ్ దురదృష్టాన్ని మార్చవలసిన బాధ్యతతో పాటు తన సినిమాను సూపర్ హిట్ చేసుకోవలసిన ఈరెండు బాధ్యతలను విజయ్ దేవరకొండ మోస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  
  


మరింత సమాచారం తెలుసుకోండి: