పరాజయాలు హీరో నితిన్ కు కొత్త కాకపోయినా ‘శ్రీనివాస కళ్యాణం’ ఫెయిల్యూర్ మటుకు నితిన్ కు విపరీతమైన షాక్ ను ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీకి కనీస విజయం కూడ దక్కక పోవడంతో నితిన్ ఎవరికీ అందుబాటులో లేకుండా తన వ్యక్తిగత సెల్ ఫోన్ ను ఆఫ్ చేసుకుని ప్రస్తుతం తన కెరియర్ గురించి అంతర్మధనంలో ఉన్నట్లు సమాచారం.

‘అ ఆ’ మూవీ తరువాత నితిన్ ఏప్రయత్నం చేసినా ఎక్కడా కలిసిరాక పోవడంతో 15 సంవత్సరాల క్రితం తనకు హిట్ మూవీని ఇచ్చిన దిల్ రాజ్ కాంబినేషన్ తనకు అదృష్టాన్ని ఇస్తుందని నితిన్ భావించాడు. అంతేకాదు  ‘శ్రీనివాస కల్యాణం’ లో నటించినందుకు పారితోషికం కూడ తీసుకోలేదు అన్న వార్తలు గతంలోనే వచ్చాయి. 
Nithiin turns architect for Satish Vegesna and Dil Raju’s Srinivasa Kalyanam
అయితే ఈమూవీ ద్వారా పారితోషికంతో పాటు తన ఇమేజ్ కూడ పోవడం నితిన్ కు తీవ్ర అవమాన భారంగా మారింది అని అంటున్నారు. ‘శతమానం భవతి’ లాంటి సూపర్ హిట్ సినిమాను తీసిన సతీష్ వేగేశ్న సినిమా కావడంతో కనీసం ఈసినిమాలో తన పాత్ర ఏమిటి అన్న ప్రశ్న కూడ వేయకుండా గుడ్డిగా నితిన్ ఈమూవీ డైరెక్టర్ ను నమ్మినట్లు సమాచారం. కథలో పట్టు లేకపోవడంతో పాటు యూత్ కు కనెక్ట్ అయ్యే ఒక్క విషయం కూడ ఈమూవీలో లేకపోవడంతో ఈమూవీకి కనీసం సరైన వీకెండ్ కలక్షన్స్ కూడ రావడం లేదు అని వార్తలు వస్తున్నాయి. 
Nithin Reddy Biography – Wiki, Age, Height, Family, Father, DOB, Sister, Songs, Career, Affairs, Lie Movie Updates, Awards, Twitter, etc
దీనికితోడు 30 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈమూవీకి 15 కోట్ల కలక్షన్స్ కూడ రావడం కష్టం అని వార్తలు వస్తున్న నేపధ్యంలో నితిన్ మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదంలో ఉంది. దీనికితోడు విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలు దూసుకు వస్తున్న నేపధ్యంలో నితిన్ అటు యూత్ కు పూర్తిగా సరిపోక ఇటు మాస్ కు పూర్తిగా కనెక్ట్ కాలేక ఒక విధమైన విచిత్ర పరిస్థితులో తన సరైన హిట్ ఇవ్వగలిగిన దర్శకుడు కోసం నీతిన్ అన్వేషణ సాగుతున్నట్లు సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: