నితిన్, అందాల తార రాశి ఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెళ్లి విశిష్టతని తెలియజేసే అంశతో ఈ చిత్ర కథ రూపొందించారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ చిత్రం బాగా కట్టుకుంటోంది.  ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్‌గా చేసుకుని రూపొందించినది కాబట్టి.. వసూళ్ల గురించి  ఫర్వాలేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.  నితిన్ కెరియర్లో తొలి రోజున అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలలో 'శ్రీనివాస కళ్యాణం' రెండోస్థానంలో నిలిచిందని అంటున్నారు.

 సెకండ్ హైయెస్ట్

దర్శకుడు సతీష్ వేగేశ్న రాసిన సంభాషణలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా మొత్తం కలర్ ఫుల్ గా సాగడం, వివాహానికి సంబంధించిన సన్నివేశాలు అందంగా ఉండడంతో, పాటల చిత్రీకరణ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన అంశాలు. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున ఈ సినిమా 5 కోట్లకి పైగా గ్రాస్ ను .. 3 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేయడం విశేషమని చెబుతున్నారు.

ఓవర్సీస్

ఈ మధ్య నితిన్ కు కూడా సరైన హిట్ లేదు. ‘లై’, ‘చల్ మోహన్ రంగా’ సినిమాలు కమర్షియల్ గా ఆకట్టుకోలేకపోయాయి.  దాంతో పదిహేను సంవత్సరాల క్రితం తనకు దిల్ చిత్రంతో మంచి హిట్  ఇచ్చిన దిల్ రాజు నే నమ్ముకున్నాడు నితిన్.   నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నైజామ్ ఏరియాలో స్వయంగా రిలీజ్ చేయగా, తొలి రోజునే 1.17 కోట్ల షేర్ ను వసూలు చేసింది.


యూఎస్ లో తొలి రోజున ఈ సినిమా 20 లక్షలను రాబట్టింది. తొలిరోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇందులో 3 కోట్లకు పైగా షేర్ ఉండడం విశేషం. వైజాగ్ లో 32 లక్షలు, ఈస్ట్ లో 23, వెస్ట్ లో 15 లక్షలు శ్రీనివాస కళ్యాణం చిత్రం తొలిరోజు రాబట్టింది. సీడెడ్ లో 37 లక్షలు, గుంటూరులో 27, కృష్ణ లో 16 లక్షలు రాబట్టడం విశేషం. 


కమల్ హాసన్ సినిమా ‘విశ్వరూపం 2’ ఈ వారంలోనే విడుదల అయ్యింది. గత వారం సినిమా ‘గూఢచారి’ పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగష్టు 15 న గీత గోవిందం చిత్రం విడుదుల కానున్న నేపథ్యంలో ఈ లోపే శ్రీనివాస కళ్యాణం చిత్రం ఎక్కువగా వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ‘శ్రీనివాస కల్యాణం’ ఈ వీకెండ్‌లో ఏ మేరకు వసూళ్లను రాబట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: