తమిళ సూపర్ స్టార్ తర్వాత ఆ తరహా స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో విజయ్.  తమిళ ఇండస్ట్రీలో విజయ్ నటించిన సినిమాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. విజయ్ సినిమాలో  మేసేజ్ ఓరియెంటెడ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా నిండుగా ఉంటాయి. విజయ్ నటించిన ‘మెర్సల్’గత ఏడాది దీపావళికి విడుదలై, సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.  మొదటి నుంచి ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మెర్సల్ రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది. 
చైనాలో విడుదల కాబోతున్న విజయ్ ‘మెర్సల్’
తెలుగులో ‘అదిరింది’ పేరుతో విడుదలయ్యి, విజయ్ చిత్రాల్లోకెల్లా అత్యధిక వసూళ్లు సాధించింది. మలేషియా, అమెరికా, శ్రీలంక, ఇంగ్లండ్ దేశాల్లో కలిపి దాదాపు 70 కోట్ల వసూళ్లు రాబట్టింది.  తమిళ సినిమాలకు మలేషియా, జపాన్ వంటి దేశాల్లోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. హిందీ సినిమాలైతే చైనా బాక్సాఫీస్ పైనా కన్నేశాయి. ఇప్పటికే ‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ వంటి ఆమీర్ ఖాన్ సినిమాలు, అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లు కురిపించాయి. కాకపోతే ‘బాహుబలి 2’ సినిమాను భారీగా ప్రమోట్ చేసి విడుదల చేసినా ఆశించిన స్థాయి ఫలితం మాత్రం రాలేదు.

ఇప్పుడు విజయ్ ‘మెర్సల్’ అక్కడ దూసుకుపోతే మాత్రం, ఇలయదళపతి మార్కెట్ భారీగా విస్తరించడం ఖాయం. విజయ్ మూడు విభిన్నమైన పాత్రలను పోషించగా, ఆయన సరసన కథానాయికలుగా సమంత .. కాజల్ .. నిత్యామీనన్ నటించారు.  వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను చైనా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాలను మొదలుపెట్టారు. అక్కడ ఈ సినిమాకి ఏ స్థాయి ఆదరణ లభిస్తుందో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: