గత కొంత కాలంగా అమెరికాలో భారతీయులపై జాతి వివక్షత చూపిస్తున్న విషయం తెలిసిందే.  ఎన్ని సార్లు ఇలాంటివి అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నా వారిలో మాత్రం మార్పు రావడం లేదు. మరోసారి భారతీయులపై బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది   జాతి వివక్షను ప్రదర్శించారు. విమానంలో గ్లాస్ నీళ్లు కోరగా.. రెండు గంటల పాటు ఇవ్వలేదు.   కానీ పక్కనే ఉన్న మరో విదేశీయుడికి మాత్రం మద్యం అందించారు. కాగా,  ఈ విషయాన్ని నటి పూజా హెగ్డే తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తన స్నేహితుడితో బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది అమర్యాదకరంగా వ్యవహరించారని మండిపడింది.
Image result for pooja hegde
అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో పూజ వెల్లడించలేదు. ‘వావ్..! నిన్న రాత్రి  బ్రిటిష్ ఎయిర్ వేస్ లో సిబ్బంది తన పట్ల ఎంత  జాతి వివక్షను ప్రదర్శించారో నా స్నేహితుడు నిన్న చెప్పాడు. అతను కేవలం గ్లాస్ మంచి నీళ్లు అడిగితే ఇవ్వకుండా రెండు గంటలు వెయిట్ చేయించారు. కానీ పక్కనే ఉన్న మరో విదేశీయుడికి గ్యాప్ లేకుండా మద్యం సప్లై చేశారు. బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది అసహ్యకరంగా ప్రవర్తించారు’ అని పూజ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ మద్య భారతీయులపై వివక్షత చూపిస్తున్నారని  బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంస్థపై ఆగ్రహం వ్యక్తంచేశాడు బాలీవుడ్ నటుడు రిషికపూర్. దయచేసి భారతీయులు ఆ విమానాలు ఎక్కవద్దని పిలుపునిచ్చారు. చిన్న పాప ఏడుస్తుందని..ఆ కుటుంబాన్ని కిందకు దించారు..వారికి సహయం చేసినమరో కుటుంబాన్ని కూడా కిందకు దించి వేశారు.  దీనిపై ఆగ్రహించిన సదరు బాధితుడు కేంద్ర విమానశాఖ మంత్రి సురేశ్‌ప్రభుకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై బ్రిటిష్ ఎయిర్ వేస్ కూడా విచారణకు ఆదేశించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: