సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. సినిమాలో రిషి పాత్రలో ఫస్ట్ లుక్ తో సర్ ప్రైజ్ చేశాడు మహేష్. సిక్స్ ప్యాక్ బాడీతో మహేష్ కనువిందు చేశాడు. ఇక ఈ సినిమా టైటిల్ గా వచ్చిన మహర్షిలో సర్ ప్రైజ్ ఫ్యాక్టర్స్ చాలానే ఉన్నాయి. క్లియర్ గా అబసర్వ్ చేస్తే గాని అవేంటో తెలుస్తాయి.


ముందు మ అక్షరంలో తుపాకి కనిపిస్తుండగా హ అక్షరంలో కత్తి ఆకారం ఉంది. ర్షిలో మాత్రం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనబడుతుంది. అంతేకాదు పైన పల్లెటూరు కింద సిటీ మధ్యలో మ్యాథ్స్ ఇలా మహర్షిలో అంత్కుచిక్కని విధంగా ఎన్నో ట్విస్టులు ఉన్నాయని తెలుస్తుంది. మహర్షి సినిమాపై మాత్రం ఎక్సైట్మెంట్ డబుల్ అయ్యిందని చెప్పొచ్చు.


దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మహర్షి టైటిల్ లోనే ఇన్ని సర్ ప్రైజులు ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.   


భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న సినిమా భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లేని అల్లరి నరేష్ ఈ సినిమా మీదే చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి మహేష్, నరేష్ మహర్షి ఎలా ఉండబోతుందో చూడాలి. 
   


మరింత సమాచారం తెలుసుకోండి: