బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయి అన్నదీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్టోబర్ నుండి మొదలవనున్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా వస్తుందని తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా మొదట 150 కోట్ల బడ్జెట్ అనుకోగా ఇప్పుడు అదే సినిమా 300 కోట్ల బడ్జెట్ కేటాయించారట.


రాజమౌళి సినిమా అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. తెలుగులో టాప్ స్టార్స్ అయిన ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి ఓ సినిమా చేయడమే ఈ ప్రాజెక్ట్ క్రేజీగా మారగా ఈ సినిమాకు సాధ్యమైంత హైప్ తెచ్చే ఆలోచనలో ఉన్నాడు జక్కన్న. ఇక ఈ సినిమాకు సర్ ప్రైజ్ గా మహేష్ వాయిస్ ఓవర్ కూడా ఉండేలా చేస్తున్నారట.


ఇప్పటికే రాం చరణ్, ఎన్.టి.ఆర్, మహేష్ ల మధ్య సాన్నిహిత్యం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుండగా ఇక ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా హాట్ న్యూస్ అయ్యింది. మహేష్ తో ఎన్నాళ్ల నుండో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న రాజమౌళి ట్రిపుల్ ఆర్ కోసం మహేష్ ను వాడేస్తున్నాడు.


ఈ సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను హిందిలో కరణ్ జోహార్ రిలీజ్ చేయాలని చర్చలు నడుస్తున్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: