చి....ల...సౌ.... ఈ సినిమా చూశారా. ఈ మధ్యే విడుదలైన ఈ మూవీలో ఓ కొత్తమ్మాయి ఎంతో ట్రెడిషనల్ గా కనిపించి అందరినీ ఇట్టే ఆకట్టుకుంది. ఆ చీర కట్టూ బొట్టూ..ఆ ఎక్స్ ప్రెషన్సూ టోటల్ గా అహా అనిపించేసింది. ఎవరీ బ్యూటీ అని అనుకోని యువ హ్రుదయం ఉండదేమో. 


ఆ చిన్నది మంచు సుందరి. ఆమె విలాసం హిమాచల్ ప్రదేశ్. అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ కి విచ్చేసిన ఈ సౌందర్యం ఇక్కడ హార్ట్ లను కొల్లగొట్టేసింది. పగ బట్టి మరీ పట్టేసింది. చక్కగా మనదైన తెలుగింటి అందంలా మెరిసిన ఈ అమ్మడు ఈ సినిమాకు ఇలా హిట్ టాక్ వచ్చిందో లేదో అసలు గుట్టు విప్పేసింది.



హాట్ హాట్ అందాలతో ఓ రేంజిలో అదరగొట్టేసింది.  లేటెస్ట్ గా  ఇన్స్టా గ్రాం  లో ఆమె పెట్టిన కొన్ని పోజులు మతి పోగొట్టేసేలా ఉన్నాయి. మళ్ళీ ఎవరీమె అనుకోవడం మన వంతు అవుతోంది. ఆరా తీసి తీరా చూస్తే  చి....ల...సౌ...లో హీరోయిన్ ఈ హాట్ బ్యూటీయేనని తెలిసింది.



ఒక్క తెలుగు సినిమాతోనే టోటల్ గా టాలివుడ్ ని తన వైపు  తిప్పుకున్న ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేస్తానంటోంది. గ్లామర్ కే కొత్త గ్లామర్ నేర్పిస్తానంటోంది. ఆమె అందాలకు ఫిదా అయిపోయిన టాలివుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆమె కోసం కొత్త పాత్రలు క్రియేట్ చేస్తున్నారుట. ఇంక రుహనీ కహానీలు ఎన్నెన్ని చూడాలో ఏమో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: