అమెరికాలో చాలాకాలం ఉండటమే కాకుండా అక్కడ ఫిలిం యాక్టింగ్ మేకింగ్ విషయాలలో అనేక హాలీవుడ్ సినిమాల టెక్నిక్స్ ను నేర్చుకున్న అడవి శేషు ఇప్పుడు తాను నేర్చుకున్న పాఠాలను తెలుగు ప్రేక్షకులకు రుచి చూపిస్తూ ఘన విజయాలు అందుకుంటున్నాడు. ఈ క్రేజీ హీరో ఇప్పటి వరకు హీరోగా నటించిన ‘కిస్’ ‘క్షణం’ ‘గూఢచారి’ సినిమాలలో ఒక డీప్ లిప్ లాక్ సీన్ ఉంది. 
My next film not with 'Kshanam' director: Adivi Sesh
ఈ సీన్స్ యూత్ కు బాగా నచ్చడంతో అడవి శేషు నటించే సినిమాలలో లిప్ లాక్ సీన్ పెట్టడం ఒక సెంటిమెంట్ గా మారింది. ప్రస్తుతం యూత్ ఈమధ్య కాలంలో సూపర్ హిట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ ‘ఆర్ ఎక్స్ 100’ ‘గూఢచారి’ సినిమాలలో లిప్ లాక్ సీన్స్  ఉండటంతో ఆమూవీల ఘన విజయంలో ఈ ముద్దు సన్నివేశాలు కూడ కీలక పాత్ర పోషించాయి అన్న అభిప్రాయం ఉంది. 
rajashekar-daughter-shivani
దీనితో అడవి శేషు రాజశేఖర్ కూతురు శివానితో నటిస్తున్న లేటెస్ట్ మూవీలో కూడ ఒక డీప్ లిప్ లాక్ సీన్ ను పెట్టాలని ఆసినిమా దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అడవి శేషు శివానీలు జంటగా నటిస్తున్న మూవీ బాలీవుడ్ హిట్ మూవీ ‘2 స్టేట్స్’ కు రీమక్ కావడంతో బాలీవుడ్ ఒరిజనల్ మూవీలో ఉన్న అనేక కిస్ సీన్స్ ను తెలుగు రీమేక్ లో కూడ రిపీట్ చేయాలని ఈమూవీ నిర్మాతలు ఆలోచన అని టాక్.

అయితే ఈసూచనకు రాజశేఖర్ కానీ అదేవిధంగా జీవిత కాని ఇష్టంగా లేరని రొమాంటిక్ ఇంటిమేట్ సీన్స్ ఘాటుగా అడవి శేషు శివానీల పై చిత్రీకరించడానికి రాజశేఖర్ అభ్యంతరాలు చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శివానీ నటిస్తున్న మొట్టమొదటి సినిమాలోనే గ్లామర్ షో ఎక్కువగా ఉంటే ఒక స్టార్ హీరో కూతురుకు ఉండవలసిన ఇమేజ్ దెబ్బ తింటుందని రాజశేఖర్ జీవితలు అడవి శేషు సెంటిమెంట్ కు బ్రేక్ వేస్తున్నట్లు సమాచారం. దీనితో ఈసున్నిత విషయాన్ని ఎలా పరిష్కరించాలో తెలియక ఈసినిమా దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: