ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకుడుగా క్రిష్ రంగప్రవేశం చేసిన దగ్గర నుంచి ఈ బయోపిక్ విషయంలో క్రిష్ అనుసరిస్తున్న వ్యూహాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ బయోపిక్ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రమే కాకుండా మహిళలకు బాగా నచ్చే విధంగా క్రిష్ ఈమూవీ స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేసినట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ బయోపిక్ బసవతారకం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందని టాక్. ‘మహానటి’ బయోపిక్ ను సమంత నడిపించినట్లుగా ఎన్టీఆర్ కథను బసవతారకం చెబుతారట. ఎన్టీఆర్ కు చాలాతక్కువ వయసులోనే 1942 టైమ్ లోనే పెళ్లి జరిగింది. ఎన్టీఆర్ కు బసవతారకంకూ బంధుత్వంతో అలనాటి అరేంజ్డ్ మ్యారేజీ సంగతులు ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి రావడం వెనుక బసవతారకం ప్రోత్సాహం అదేవిధంగా రాజకీయాలలోకి వెళ్ళమని బసవతారకం ఇచ్చిన స్ఫూర్తితో ఎన్టీఆర్ బయోపిక్ స్టోరీలో బసవతారకం యాంగిల్ లో స్టోరీ టెల్లింగ్ ఉంటుందని టాక్. 
director krish starts ntr biopic regular shooting with nandamuri balakrishna
కేవలం ఒక గృహిణిగా మాత్రమే కాకుండా ఎన్టీఆర్ జీవితాన్ని ప్రభావితం చేసిన కీలక శక్తిగా ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రను క్రిష్ తీర్చి దిద్దాడని సమాచారం. బసవతారకం 1985లో మరణించారు. అంటే అప్పటికే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ముఖ్యమంత్రి కావడం జరిగిపోయింది. అంతేకాదు ఆనాటికే నాదెండ్ల వెన్నుపోటును అధిగమించి  ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడం ఆనాటి చరిత్ర. సరిగ్గా ఆసమయంలోనే బసవతారకం చనిపోయారు. 

దీనితో ఎన్టీఆర్ బయోపిక్ బసవతారకంతో మొదలై బసవతారకంతో ముగిస్తుందని ఈ సూచనకు బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చాలామంది అంగీకరించడంతో క్రిష్ తనదైన క్రియేటివిటితో ఎన్టీఆర్ బయోపిక్ లో ఊహించని మార్పులు చేసాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈమార్పులు అన్నీ ఎన్టీఆర్ బయోపిక్ కోసమా లేక బసవతారకం పాత్ర పోషిస్తున్న విద్యాబాలన్ కోసమా అంటూ కొందరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: