ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో స్టైలిష్ మదర్ గా అందరి మన్ననలు పొందుతూ అనేకమంది యంగ్ హీరోలకు అందమైన అమ్మగా నటిస్తున్న పవిత్రా లోకేష్ పుట్టింది పెరిగింది మైసూర్ లో అయినా ఇప్పుడు ఆమె తెలుగు సినిమాలలో బిజీ కేరెక్టర్ ఆర్టిస్ట్. ప్రముఖ కన్నడ నటుడు మైసూర్ లోకేష్ కుమార్తెగా ఈమెకు కన్నడ సినిమా కన్నడ టివి రంగాలలో విపరీతమైన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.
Image may contain: one or more people and close-up
తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో అయిష్టంగా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన ఈమె శ్రీదేవిలా సూపర్ స్టార్ అవ్వాలని కలలలో ఉండేది. అయితే తన కెరియర్ ప్రారంభంలో తన హైట్ మరియు వెయిట్ తన హీరోయిన్ కెరియర్ కు మైనస్ గా మారితే ఇప్పుడు అదే హైట్ వెయిట్ తాను నటిస్తున్న తల్లి పాత్రలకు ప్లస్ పాయింట్ గా మారింది అని అంటూ తన పై తానే జోక్ చేసుకుంది. ఇదే సందర్భంలో వెండి తెర మన్మధుడు నాగార్జున గురించి మాట్లాడుతూ తాను నాగార్జున నటించిన ‘గీతాంజలి’ సినిమాను తాను 8వ క్లాస్ చదువుకుంటున్నప్పుడు చూశానని అంటూ తన మొదటి క్రష్ కోరిక నాగార్జున పై కలిగిన విషయాన్ని బయటపెట్టింది పవిత్రా లోకేష్.
Image may contain: 1 person, close-up
అంతేకాదు తన రెండవ క్రష్ కోరిక ప్రకాష్ రాజ్ పై కలిగిందని అయితే వీరిని అనేక సందర్భాలలో తాను కలిసినా తన కోరిక వారి వద్ద వ్యక్త పరచలేక పోయాను అంటూ తన తీరని కోరికను బయటపెట్టుకుంది ఈ తెలుగు సినిమా అందమైన అమ్మ. ఇదే సందర్భంలో తాను అమ్మగా నటించిన అనేకమంది స్టార్ యంగ్ హీరోల గురించి మాట్లాడుతూ యంగ్ హీరోలలో అల్లు అర్జున్ కు ఉన్నంత ఓపిక శ్రద్దా మరి ఏహీరోలకు లేదు అంటూ తనను ‘బెస్ట్ మమ్మీ’ అంటూ బన్నీ ఏడిపిస్తాడు అని ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో పవన్ కు అత్తగా నటించిన సందర్బాన్ని వివరిస్తూ మహిళల పట్ల సంస్కార వంతంగా ప్రవర్తించడంలో పవన్ స్థాయి మరి ఏహీరోకి రాదు అంటూ పవన్ వ్యక్తిత్వం పై ప్రశంసలు కురిపించింది పవిత్రా లోకేష్. ప్రస్తుతం సినిమాలలో ఎందరో హీరోలకు తల్లిగా నటిస్తూ బిజీగా ఉన్నా తనకు నెగిటివ్ పాత్రలు ఉన్న కోరిక ఉందని అయితే తన కోరిక విని తనను ప్రోత్సహించే వారు ఎవరు లేరు అంటూ జోక్ చేసిన పవిత్రా లోకేష్ ‘అమ్మ’ క్రేజ్ ఇండస్ట్రీలో మరికొన్ని సంవత్సరాలు కొనసాగించే ఆస్కారం ఉంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: