నాని హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 వారం వారం ఎలిమినేషన్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ వారం బాబు, గణేష్, దీప్తి, తనీష్ లలో ఎవరు బయటకు వస్తారన్న దాని మీద కన్ ఫ్యూజన్ ఏర్పడింది. నిన్న శ్యామలా, గీతాలను సేఫ్ అని చెప్పిన నాని ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పబోతున్నారు.


అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం బాబు గోగినేని బయటకు వచ్చేస్తాడని టాక్. రెండు వారాలుగా కౌశల్, గీతాల మీద ఫైట్ చేసిన బాబు గోగినేని బిగ్ బాస్ నుండి బయటకు వెళ్లాలని ఉందన్న అభిప్రాయాన్ని చెప్పాడు. అంతేకాదు ఇదవరకు ఉన్నంత జోష్ ఆనయలో కనిపించడం లేదు.


బిగ్ బాస్ టాస్కులలో కూడా అంత చురుగ్గా పాల్గొనడం లేదు అన్నది ఓపెన్ టాక్. హేతువాది అయిన బాబు గోగినేని ఎలాంటి గేం ప్లానింగ్ లేకుండా ఇదంతా చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ నుండి ఈ వారం బాబు గోగినేని ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు. అందరికన్నా బాబుకే తక్కువ ఓట్స్ వచ్చాయట. 


అంతేకాదు బయట కౌశల్ ఆర్మీ పనితనం వల్ల కూడా బాబు ఎలిమినేషన్ మీద ఎఫెక్ట్ పడ్డదట. బాబు గోగినేని ఎలిమినేట్ కావాలని మిగతా ఇంట్ సభ్యులకు ఓటింగ్స్ జరిపించారట. మొత్తానికి బిగ్ బాస్ నుండి బాబు నిష్క్రమణ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది ఈరోజు నైట్ తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: