తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు తెచ్చిన సినిమాలు ఈమధ్య బాగా ఎక్కువయ్యాయి. కంటెంట్ బలంతో వస్తున్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. అయితే అలాంటి సినిమాల్లో అడల్ట్ కంటెంట్ కాస్త ఎక్కువ ఉన్నా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో లాస్ట్ ఇయర్ వచ్చిన అర్జున్ రెడ్డి, ఈ ఇయర్ వచ్చిన ఆరెక్స్ 100 పర్ఫెక్ట్ ఎక్సాంపుల్.  


అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఆరెక్స్ 100 మూవీ 2 కోట్ల బడ్జెట్ తో వచ్చి 15 కోట్ల పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించిన ఈ సినిమా హిట్ అవడంతో రీమేక్ హక్కులు భారీగా సేల్ అయ్యాయి. 


ఈ సినిమా హింది వర్షన్ అజయ్ డైరక్షన్ లోనే వస్తుందని తెలుస్తుండగా.. తమిళ రీమేక్ మాత్రం అతను సరే అనేశాడు. అయితే ఆరెక్స్ 100 తమిళ రీమేక్ రైట్స్ ఆది పినిశెట్టి సొంతం చేసుకున్నాడు. సినిమా కంటెంట్ నచ్చి ఆది ఈ సినిమా తీసుకున్నాడట. అక్కడ ఆది హీరోగానే చేస్తున్నాడని తెలుస్తుంది. 


దర్శకుడు, హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. కోలీవుడ్ లో హీరోగా చేస్తూనే తెలుగులో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరియర్ వెళ్లదీస్తున్న ఆది పినిశెట్టి ఆరెక్స్ 100 తో అక్కడ ఆది ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. కోలీవుడ్ లో ఆది కెరియర్ కు ఈ ఆరెక్స్ 100 ఎలాంటి కొత్త టర్న్ ఇస్తుందో చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: