సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పైరసీ భూతం పడగ విప్పుతుంది.  ముఖ్యంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలకు ఈ బెడద చాలా ఉంటుంది.  ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షం అయిన విషయం తెలిసిందే.   గతంలో పవన్ కళ్యాన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కి కొన్ని రోజుల ముందు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిందే.  అప్పట్లో ఇది పెను సంచలనం రేపింది.  సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కబాలి కూడా రిలీజ్ కి ముందే కొన్ని సీన్లు నెట్టింట్లో ప్రత్యక్షం అయ్యింది. 

తాజాగా ఇప్పుడు అర్జున్ రెడ్డి తో సూపర్ హిట్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’ సినిమా నెట్ లో ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ షాక్ తిన్నారు. ఇప్పటికే  ఈ సినిమాకు సంబంధించిన సీన్లు పలువురు నెటిజన్ల వద్ద ఉండటంతో దాన్ని ఈజీగా స్ప్రెడ్ చేస్తున్నారు.  వాట్సాప్, యూట్యూబ్ లో ఇది షేర్ చేయడంతో చిత్ర యూనిట్ తలలు పట్టుకున్నారు.  వెంటనే స్పందించి దానికి సంబంధించిన లింగ్ డిలీట్ చేసినట్లు సమాచారం.  ఇదిలా ఉంటే..విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవిందం’ సినిమా లీక్ కేసును పోలీసులు ఛేదించారు.

పైరసీకి పాల్పడిన చీరాలకు చెందిన పడవల రాజేష్ ను అరెస్టు చేసినట్టు గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కొంత కాలాంగా ఫిలింనగర్ లో డేటా డిజిటల్ బ్యాంకు అడ్మిన్ గా పని చేస్తున్న రాజేష్ ఎడిటింగ్ నిమిత్తం ఇచ్చిన హార్డ్ డిస్క్ లోని డేటాను తన ల్యాప్ టాప్ లో కాపీ చేసి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. 
Image result for geeta govindam
పెన్ డ్రైవ్ ల ద్వారా తన స్నేహితులకు, అదే విధంగా, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు రాజేశ్ పంపినట్టు పోలీసులు తెలిపారు. జేశ్ నుంచి 3 ల్యాప్ టాప్ లు, 3 పెన్ డ్రైవ్ లు, 3 హార్డ్ డిస్క్ లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ వీడియోను షేర్ చేసిన మరో ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేశామని అన్నారు.  అంతే కాదు విజయ్ దేవరకొండ నటించిన ‘ట్యాక్సీవాలా’ కూడా పైరసీ అయినట్లు పోలీసులు గుర్తించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: