బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో క్రేజీ కంటెస్టంట్ అయిన బాబు గోగినేని ఈ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యారు. 64 రోజుల బిగ్ బాస్ జర్నీలో బాబు గోగినేని ఒక్క కౌశల్ తో తప్ప మిగతా వారందరితో బాగానే కలివిడిగా ఉన్నారు. కౌశల్ తో మాత్రం బాబు ఎప్పుడు గొడవపడుతూ వచ్చారు. 


ఈ వారం నామినేషన్ లో ఉన్న బాబు గోగినేనిని కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసింది. అందుకే బాబుకి కాకుండా మిగతా ఇంటి సభ్యులకు తమ సపోర్ట్ అందించారు. ఫైనల్ గా బాబు గోగినేని బయటకు రావాల్సి వచ్చింది. బయటకు వచ్చాక ఇంట్లో సభ్యుల గురించి తక్కువ చేసే పని ఏమి చేయలేదు బాబు గోగినేని.


కౌశల్ ను బయటకు పంపించాలని తెగ ప్రయత్నాలు చేసిన బాబు చివరకు ఆయనే బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ లో నామినేట్ అవడమే ఆలస్యం కౌశల్ ఆర్మీ చేతుల్లోనే ఎలిమినేటర్ అన్నట్టు పరిస్థితి మారిందని అంటున్నారు. ఆల్రెడీ కౌశల్ కు కూడా ఈ మెసేజ్ పాస్ అవడంతో చాలా ధైర్యంగా ఉన్నాడు. 


మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ ఈ వారం బాబు గోగినేని ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చింది. ఇక వచ్చే వారం నుండి ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. మరోసారి కౌశల్ ను టార్గెట్ చేసిన వారే ఎలిమినేట్ అవుతున్నరాన్న వాదనకు ఈ వారం ఎలిమినేషన్ కూడా బలాన్ని చేకూర్చింది.
  


మరింత సమాచారం తెలుసుకోండి: