‘కలర్స్’ స్వాతిగా కొంతకాలం బుల్లి తెరను షేక్ చేసిన స్వాతి ఆతరువాత హీరోయిన్ గా మారి మంచి పేరు తెచ్చుకున్నా క్రేజీ టాప్ హీరోయిన్ గా మారలేకపోయింది. ఆమధ్య ఒక టాలీవుడ్ యంగ్ హీరోతో స్వాతి ప్రేమలో పడింది అని వార్తలు రావడంతో స్వాతి పెళ్లి పై గత కొంత కాలంగా గాసిప్పులు హడావిడి చేస్తూనే ఉన్నాయి.

అయితే ఎవరు ఊహించని విధంగా స్వాతి ఒక ఇంటర్ నేషనల్ విమాన సంస్థకు చెందిన ఒక పైలెట్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్వాతి కాబోయే భర్త పేరు వికాస్. మలేషియన్ ఎయిర్ లైన్స్ లో ఇతడు పైలెట్ గా పనిచేస్తున్నాడు. కొచ్చిన్ ప్రాంతానికి చెందిన ఈ మలయాళ యువకుడుతో స్వాతికి గత కొంతకాలంగా పరిచయం ఉండటంతో ఆ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఎరెంజ్డ్ మ్యారేజ్ గా మారింది.

ఈనెల 30వ తారీఖున హైదరాబాద్ లో స్వాతి పెళ్లి జరగబోతోంది.  ఆతరువాత సెప్టెంబర్ 2న కొచ్చిన్ లో వీరి పెళ్ళి రిసెప్షన్ జరుగుతుంది. ప్రస్తుతం వికాస్ మలేషియాలోని జకార్తాలో ఉంటున్న నేపధ్యంలో పెళ్ళి తరువాత స్వాతి మలేషియా వెళ్ళి పోతుందని తెలుస్తోంది.  

రష్యాలో పుట్టి తెలుగు సినిమాలతో పాటు దక్షిణాది సినిమాలలో నటించిన స్వాతి చివరకు మలేషియాలో సెటిల్ అవుతూ ఉండటం యాధృశ్చికం అనుకోవాలి. మంచి నటిగా పేరు తెచ్చుకున్నా తన సమర్ధతకు తగిన అవకాశాలు తనకు రాలేదు అంటూ అనేకసార్లు బాధ పడ్డ స్వాతి చిట్టచివరకు ఒక విధంగా అసంతృప్తితోనే తన ఫిలిం ఇండస్ట్రీ కెరియర్ కు గుడ్ బై చెపుతోంది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: