ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో పైరసీలతో నిర్మాతలు సతమతమవుతున్నారు.  ఎన్నో కోట్లు వెచ్చించి ఓ సినిమా తెరకెక్కిస్తే..చివరికి అది రిలీజ్ కి ముందే నెట్ లో రిలీజ్ అయితే వారి పరిస్థితి ఎంతదారుణంగా ఉంటుందో ఊహించుకోవొచ్చు.  తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన ‘గీతాగోవిందం’ సినిమా యూట్యూబ్, వాట్సాప్ లో లీక్ కావడంతో చిత్ర యూనిట్ కంగారు పడ్డారు.  వెంటనే అలర్ట్ అయి దానికి కారణం అయిన వారిని అరెస్ట్ చేశారు..కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  నిన్న గీతాగోవిందం ప్రీరిలీజ్ పంక్షన్ అయ్యింది. 
Image result for geetha govindam allu aravind pre release event
ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..రిలీజ్‌కు ముందే సినిమాలను పైరసీ చేయడం సిగ్గుమాలిన పని అన్నారు. గీత గోవిందం సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను ముందే పైరసీ చేయడంపై ఆయన మండిపడ్డారు. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోలను బయటపెట్టాడు.. వాటిని ఫ్రెండ్స్‌కు షేర్ చేయడం వల్ల 17మందికి చేరిందన్నారు.  సినిమా క్లిప్పింగ్స్‌ను బయటపెట్టడం కొందరు ఫ్రెండ్లీగా భావిస్తున్నారని.. ఇది క్రైమ్ అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలంటున్నారు.

ఈ పైరసీ వ్యవహారంలో ఇండస్ట్రీ సిగ్గు పడాలన్నారు అరవింద్. గీత గోవిందం మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలు ఇలాగే పైరసీ చేశారు.. ఇలాంటి మరోసారి చేయొద్దని కోరారు.  గతంలో పవన్ కళ్యాన్ నటించిన అత్తారింటికి దారేది సినిమా కూడా ఇలాగే నెట్ లో రిలీజ్ అయ్యిందని..ఆ సమయంలో నిర్మాత ఎంతో కుంగిపోయారని..కానీ సినిమా మాత్రం అద్బుతవిజయం సాధించిందని అన్నారు. 

ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’ సినిమా పైరసీ చేశారు.  అయితే  విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చేతుల్లో తన్నులు తినొద్దు.. అంటే ఫ్యాన్స్‌ను కొట్టమని చెప్పడం లేదన్నారు. ఓ సినిమా తీయాలంటే ఎంత కష్టపడతామో అర్థం చేసుకోవాలన్నారు అరవింద్. ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అరవింద్.


మరింత సమాచారం తెలుసుకోండి: