నిన్నటిరోజున వైజాగ్ లో జరిగిన ‘గీత గోవిందం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ చేసిన ఉపన్యాసం అతడి అభిమానులకు బాగానచ్చితే ఆఉపన్యాసంలో అతడు వాడిన పదాలతో మరొకసారి అతడి ‘ఇగో’ బయట పడింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తన మూవీకి సంబంధించి పైరసీ జరగడంతో తన మూడ్ బాగాలేదు అని అంటూ తమలాంటి యాక్టర్లను ప్రశాంతంగా సినిమాలు చేసుకోనీయకుండా తనకు బ్రేక్ వేసేపనులు చేయవద్దు అంటూ ఆపైరసీ వెనుక ఎదో అజ్ఞాతవ్యక్తి హస్తం ఉన్నట్లుగా కామెంట్ చేసేసాడు విజయ్ దేవరకొండ. 
కావాలని మమ్మల్ని కిందకు లాగుతున్నారు
తాను చిన్నప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఎదిగానని తనకు పోరాటాలు కొత్తేమి కాదని ఎలాంటి సమస్యనైనా పోరాడి గెలవడం తనకు తెలుసు అంటూ కామెంట్స్ చేసాడు. తాను పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నాను అంటూ కొందరు తనపై నెగిటివ్ కామెంట్స్ చేయడం తనకు బాథ కలిగిస్తోంది అంటూ విజయ్ తన మాటలలో ఇగో ను బయటపెట్టుకున్నాడు.
ఎవరు ఏమన్నా పడతాను
అంతేకాదు తాను అనుకున్నది సాధిస్తానని ఆనమ్మకం తనకు ఉంది అని అంటూ ఆగష్టు 15న విడుదల కాబోతున్న తన ‘గీత గోవిందం’ సినిమాను చూసి అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు అంటూ ఈమూవీ సక్సస్ ను ఎవరు ఆపలేరు అన్న మాటలు అత్యంత ఆవేసవంతంగా మాట్లాడాడు విజయ్. అంతేకాదు తాను ఎవరు ఏమన్నా పడతాను అని అంటూ అయితే తనకు నచ్చిన పనిని చేయడంలో ఆపే శక్తీ ఎవరికీ లేదు అని అంటూ విజయ్ చేసిన కామెంట్స్ విన్నవారు విజయ్ ని అడ్డుకుంటున్న శక్తి ఎదోతెలియక కొంత అయోమయంలో పడినట్లు టాక్.
మాతో ఇలాంటి పనులు చేయిస్తారా?
ఈమధ్య కాలంలో సినిమాల విడుదలకు ముందు విపరీతంగా అంచనాలు పెంచడం ఒక శాపంగా మారుతోంది. గతవారం విడుదలైన ‘శ్రీనివాసకళ్యాణం’ ఫెయిల్ అవ్వడానికి దిల్ రాజ్ అనుసరించిన మితిమీరిన అంచనాల పబ్లిసిటీ కారణం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ‘గీత గోవిందం’ విషయంలో జరిగిన పైరసీ లీక్ ల వెనుక ఎదో ఒకశక్తి ఉంది అటువంటి శక్తులను ఎదిరించే ధైర్యం తనకు ఉంది అంటూ విజయ్ దేవరకొండ చేస్తున్న కామెంట్స్ అతని మితిమీరిన విశ్వాసంతో పాటు అతడిలోని లోలోపల ‘ఇగో’ ను మరొకసారి బయట పెట్టాయి అంటూ కొందరి విశ్లేషకుల అభిప్రాయం..    


మరింత సమాచారం తెలుసుకోండి: