బుల్లితెరపై ‘కలర్స్’ ప్రోగ్రామ్ తో తన ముద్దు ముద్దు మాటలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన అమ్మాయి కలర్స్ స్వాతి.  కొంత కాలంగా తర్వాత వెండి తెరపై హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది.    తెలుగు, మళియాళ భాషల్లో నటించిన స్వాతి ఈ మద్య సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చింది.  ఇండస్ట్రీస్‌లో వ్యాఖ్యాత, సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సినిమా విషయానికి వస్తే..డేంజర్, అష్టాచమ్మా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, గోల్కొండ హైస్కూల్‌, క‌ల‌వ‌ర‌మాయె మ‌దిలో, స్వామి రారా, కార్తికేయ‌ తదితర తెలుగు చిత్రాల్లో నటించింది.
Image result for colors swathi
  అయితే కొంత కాలంగా స్వాతిపై రక రకాల రూమర్లు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఓ తెలుగు హీరోతో లవ్ లో ఉన్నట్లు..వార్తలు వచ్చాయి.  ఆ తర్వాత ఓ మళియాళ హీరో తో లవ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి..కానీ వీటిపై స్పందించిన స్వాతి అవన్నీ ఒట్టి రూమర్లే అని కొట్టిపడేసింది.  తాజాగా స్వాతికి సంబంధించిన పెళ్లి వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Image result for colors swathi
స్వాతి పెళ్లి చేసుకోబోయే వరుడు  పేరు వికాస్. అతడొక పైలెట్ అని తెలుస్తోంది. మలేసియా ఎయిర్ లైన్స్‌లో వికాస్ పైలెట్‌గా చేస్తాడని, జకార్తాలో నివాసం ఉంటాడని సమాచారం. వీరిది ప్రేమ కమ్ పెద్దలు కుదిర్చిన పెళ్లిగా తెలుస్తోంది. కొన్నాళ్ల నుంచి వికాస్, స్వాతిలు ప్రేమలో ఉన్నారట. ఆ ప్రేమకు పెద్దల ఆశీర్వాదం దక్కి వీరి పెళ్లి జరగబోతోంది. ఆగస్టు 30వ తేదీన వీరి పెళ్లి జరగనుండగా, సెప్టెంబర్ రెండో తేదీన రిసెప్షన్ ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: