ఢిల్లీకి రాజు అయినా..తల్లికి మాత్రం కొడుకే అన్నట్లు ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్..క్రేజ్ సొంతం చేసుకున్న హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్..తాజాగా ‘భరత్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ చిత్రంతో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నటించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల నటించడం లేదు..ఆమె స్థానంలో కత్రికనా కైఫ్ కి స్థానం లభించింది. 

Image result for సల్మాన్ ఖాన్ భరత్

సల్మాన్‌ఖాన్ ప్రస్తుతం భారత్ చిత్రంతో బిజీగాబిజీగా ఉన్న విషయం తెలిసిందే. భారత్ షూటింగ్ ఉత్తరాఫ్రికా తీరం, సిసిలీ ప్రాంతాల మధ్య ఉన్న మాల్టాలో జరుగుతుంది.  సాధారణంగా విదేశాల్లో షూటింగ్ జరిగే సమయంలో సల్మాన్ ఖాన్ తన బాడీగాడ్స్ ని మాత్రంమే తీసుకు వెళ్తుంటారు..కానీ ఈ సారి మాల్టాలో జరుగుతున్న షూటింగ్ కి తన కుటుంబ సభ్యులను తీసుకు వెళ్లారు. 


మాల్టాలోని లొకేషన్‌లో తన తల్లి సల్మాఖాన్‌తో కలిసి దిగిన ఫొటోతోపాటు విత్ లవ్ ఆఫ్ మై లైఫ్ అనే క్యాప్షన్ పెట్టాడు సల్మాన్‌ఖాన్.సల్మాఖాన్ తన సోదరి అల్విరా అగ్నిహోత్రి, మరిది అతుల్ అగ్నిహోత్రితో కలిసి మాల్టాకు వెళ్లింది. తాజాగా తల్లితో కండలవీరుడు దిగిన ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: