అక్కినేని హీరో సుశాంత్ హీరోగా వచ్చిన చిలసౌ సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ రుహాని శర్మ. సినిమాలో ఆమె లుక్ పరంగా అంతగా ఇంప్రెస్ చేయకున్నా నటన పరంగా మార్కులు కొట్టేసింది. రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సుశాంత్ కెరియర్ లో మంచి హిట్ సాధించింది.


అయితే సినిమా కలక్షన్స్ పరంగా అంత సాటిస్ఫైడ్ గా లేదని టాక్. ఏది ఎలా ఉన్నా సుశాంత్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం గొప్ప విషయం. ఇక నుండి సుశాంత్ మరింత ఫోకస్ గా సినిమాలు చేసేందుకు చిలసౌ ప్రోత్సహించేట్టు చేసింది. ఈ సినిమాకు రిలీజ్ ముందే బజ్ కూడా బాగా వచ్చింది.


చిలసౌలో హీరోయిన్ గా నటించిన రుహాని శర్మ సినిమాలో పాత్ర ప్రకారం అలా కనిపించింది కాని ఆమెలో కూడా మిరుమిట్లు గొలిపే అందాలు ఉన్నట్టు తెలుస్తుంది. సినిమాలో మొటిమల మొహంతో కనిపించిన రుహానిలో అసలు మ్యాటర్ వేరే ఉన్నట్టు కనిపిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడి హాట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


సినిమాలో అమ్మడు కనిపించిన దాని కన్నా హాట్ పిక్ లో అదరగొట్టింది. ఆమె ఈమేనా కాదా అనేలా ఉన్న రుహాని అందాలు చిలసౌలో వాడే అవకాశం రాలేదని చెప్పొచ్చు. రుహాని టాలెంట్ మెచ్చి అవకాశం ఇస్తే ఇక నుండి ఆమె గ్లామర్ పాత్రల్లో కూడా నటించేందుకు సై అంటుంది. దానికి శాంపిల్ గా హాట్ పిక్ తో సర్ ప్రైజ్ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: