ఓ సినిమా హిట్ కావాలంటే చాలా రకాల ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. ఓ పద్ధతి ప్రకారం ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకోవాలి. అంతేనా సినిమా పూర్తైన తర్వాత ప్రమోషన్ తో క్రేజ్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళాలి. మరోపక్క పాజిటివ్ బజ్ కూడా ఉండాలి. ఇవన్నీ ప్లానింగ్ ప్రకారం జరిగితేనే సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ కి క్యూకడతారు.


నిర్మాత సినిమా తెరకెక్కించిన తర్వాత హిట్ అయ్యే వరకు పడే కష్టం గాని టెన్షన్ గాని వర్ణణాతీతం. అంత కష్టపడి తీసిన సినిమా కాస్తా లీక్ అయితే ఏంటి పరిస్థితి...? ప్రొడ్యూసర్ పరిస్థితి కక్కాలేక మింగాలేక అన్నట్లుగా ఉంటుంది కదా. అయితే రీసెంట్ గా లీకులతో గీతా గోవిందం మూవీ హాట్ న్యూస్ అయిన విషయం తెలిసింది. కాని సినిమా ప్రొడ్యూసర్లు మాత్రం కూల్ గా కామ్ గా ఉన్నారు. దీనికి కారణం హీరో విజయ్ దేవరకొండ అని టాక్.


పెళ్ళిచూపులు సినిమాతో విజయ్ మంచి హీరో అనిపించుకున్నాడు. తర్వాత వచ్చిన అర్జున్  రెడ్డి మూవీతో యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. షార్ట్ టైమ్ లో స్టార్ డమ్ సంపాదించుకున్నా హీరో ఈ మధ్య కాలంలో ఆయనే అని చెప్పొచ్చు. అయితే ఏదో ఓ సినిమా హిట్ అయినంత మాత్రాన్న విజయ్ స్టార్ అయిపోతాడా.. అని చెవులు కొరుక్కున్నవాళ్ళూ ఉన్నారు. వాళ్లకి సూపర్ అడ్వాన్స్ బుకింగ్స్ తో విజయ్ దేవరకొండ సమాధానం చెబుతున్నాడు. 


ఆగస్ట్ 15న అనగా రేపు రిలీజ్ కానున్న గీతా గోవిందం మూవీకి ఓ రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇదంతా కేవలం విజయ్ దేవరకొండ క్రేజ్ వల్లే అని మూవీ యూనిట్ భావిస్తోందట. లీకులతో మొదట కాస్తాంత టెన్షన్ పడ్డ సినిమా యూనిట్.. హీరో గారి క్రేజ్ మీద నమ్మకంతో కూల్ అండ్ కామ్ అయిపోయిందట. వారి నమ్మకానికి తగ్గట్లుగానే సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ దాన్ని బట్టే కలక్షన్స్ ఉంటాయని భావిస్తున్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: