తెలుగులో సంచలన విజయంసాధించిన ‘మహానటి ఇపుడు విదేశాల్లో కూడ సత్తా చాటుకుంటోంది.. ఇండియన్‌ ఫిల్మ్‌ ఫస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌కు ఎంపికైన మమానటి ఈక్వెలిటీ ఇన్‌ సినిమా అవార్డును సొంతం చేసుకుంది.  మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి‘. ఇది తెలుగులో వచ్చిన తొలి బయోపిక్ ఇదే కావడం మరో విశేషం. రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లు సాధించి, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ప్రదర్శనకు ఎంపికైంది.

Image result for మహానటి అవార్డు

ఈక్వెలిటి ఇన్ సినిమా అవార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇది ఈ మూవీకి తొలి అవార్డు.  మహానటి టీం దర్శఖుడు నాగ్‌ అశ్విన్‌, హీరోయిన్‌ కీర్తిసురేష్‌, నిర్మాతలు స్వప్న, ప్రియాంకదత్‌ ఆ వేడుకకు హాజరైన అవార్డు అందుకున్నారు. మహానటి టీం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, హీరోయిన్‌ కీర్తిసురేష్‌, నిర్మాతలు స్వప్న, ప్రియాంకదత్‌ ఆ వేడుకకు హాజరైన అవార్డు అందుకున్నారు.అవార్డు అందుకోవడంపై నిర్మాత స్వప్న దత్ మాట్లాడుతూ... ఇది మా సినిమాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

Mahanati wins IFFM Award

మహానటి కేవలం డొమెస్టిక్ మార్కెట్లో మాత్రమే కాదు ఓవర్సీస్ మార్కెట్లో కూడా సత్తా చాటిందని తెలిపారు. ఇలాంటి సినిమా మా సంస్థ నుండి రావడం గర్వంగా ఉందన్నారు. అవార్డు వేడుక తర్వాత ప్రముఖ బాలీవుడ్‌ విశ్లేషకులు రాజీవ్‌ మసంద్‌తో ఇంటర్వ్యూ కూడ ఇచ్చారు. మహానటి సినిమాకు సంబంధించిన మేకింగ్‌ విశేషాలతో పాటు చాలా విషయాలు మీడియాతో పంచుకునానరు.. అంతేకాదు మహానటిలో అద్భుతమైన నటన కనబర్చిన కీర్తిసురేష్‌ ఉత్తమనటి కేటగిరిలో నామినేట్‌ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: