ఈ మద్య సూపర్ హిట్ సినిమాలు ఇతర భాషల్లోకి రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.  కొన్ని సినిమాలు అయితే డబ్బింగ్ అవుతున్నాయి.  ఈ మద్య కాలంలో చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో సూపర్ హిట్ అవుతున్న విషయం తెలిసిందే.  కంటెంట్ బాగుంట తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలైనా బాగా ఆదరిస్తున్నారనడానికి ‘పెళ్లిచూపులు’,‘అర్జున్ రెడ్డి’ రీజెంట్ గా రిలీజ్ అయిన ‘ఆర్ ఎక్స్ 100’ అని చెప్పొచ్చు.  పెట్టింది 2.7 కోట్లే కానీ వచ్చింది మాత్రం 15కోట్లకు పై మాటే.. ఇంతటి విజయాని నమోదు చేసిన “ఆర్ఎక్స్ 100” తమిళంలో కూడా విడుదలకానుంది. 
Image result for aadhi pinisetty navarro
ఇక తమిళ్ వర్షంలో వస్తున్న సినిమాలో కార్తికేయ కాదు..సరైనోడు సినిమాలో విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకొని రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’టాంటి సూపర్ హిట్ సినిమాలో చరణ్ అన్న పాత్రలో నటించిన ఆది పినిశెట్టి.  ‘వైశాలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయిన ఆది పినిశెట్టి ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలు నటించడానికైనా సిద్దంగా ఉన్నారు.  ఈ నేపథ్యంలో ఆది “ఆర్ఎక్స్ 100” తమిళ రీమేక్ లో నటించనున్నాడు. హీరో ఆదికి తమిళంలో కూడా ఫాలోయింగ్ బాగానేవుంది. 
Image result for aadhi pinisetty navarro
ప్రముఖ నిర్మాత, దర్శకులు రవిరాజ పినిశెట్టి తనయుడైన ఆది పినిశెట్టి ప్రస్తుతం ‘నీవెవరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  ఈ సినిమాలో తాప్సీ, రితికా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవర్ని తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.  అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకుడు ఎవరు ? హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది ఇంకా ఫైనల్ కావాల్సి ఉందని “అవురా సినిమాస్” ప్రతినిధి మహేశ్ తెలిపాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: