నందమూరి మూడో తరం వారసుడు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఇంత వరకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఆఫీసియల్ గా ప్రకటన మాత్రం రాలేదు. అయితే బాలయ్య తరం తరువాత ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగి పోయినాడు. మోక్షజ్ఞ వచ్చినా ఇప్పుడు ఎన్టీఆర్ స్థాయికి వస్తేనే మూడోతరం వారసుడు అవుతాడు. ఎప్పటి నుంచో మోక్షజ్ఞను స్క్రీన్ మీదకు తేవాలని బాలయ్య ఆలోచన. కానీ మనం ఒకటి తలిస్తే భగవంతుడు మరొకటి తలుస్తాడని సామెత. రకరకాల కారణాల వల్ల మోక్షజ్ఞ సినిమా ఎంట్రీలేటు అవుతోంది.

Image result for mokshagna

ఈలోగా మోక్షజ్ఞ ఫిజిక్ బాగా పాడయిందని, అతగాడిని ఫిల్మ్ నగర్ సమీపంలోని కేఫ్ ల్లో చూసిన వారి బోగట్టా. బాగా లావు అయిపోయాడని, బాగాతగ్గితే తప్ప, సినిమాల్లోకి రావడం కష్టం అని గుసగుసలు వినిపించాయి. ఇదిలావుంటే సరిగ్గా నెలక్రితం మోక్షజ్ఞను బాడీ రీబిల్డ్, మేకోవర్ కోసం సింగపూర్ పంపించారని వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ ఎన్టీఆర్ గా కనిపించే అవకాశం వుందనీ వినిపించింది.

Image result for mokshagna

మోక్షజ్ఞను సింగపూర్ పంపించింది అయితే వాస్తవం. మరి దేనికి పంపారన్నది తెలియదు. మేకోవర్ కోసం అని అప్పట్లో వినిపించింది. కానీ లేటెస్ట్ గా తెలుస్తున్న విషయం ఏమిటంటే మోక్షజ్ఞ సింగపూర్ నుంచి పదిహేను రోజులక్రితమే వెనక్కు వచ్చేసారని. ప్రస్తుతం ఇంట్లోనే వుంటున్నారని. అంతేకాదు, మోక్షజ్ఞ ఫిజిక్ లో ఏమీ తేడాలేదని తెలుస్తోంది.  అంటే సింగపూర్ మేకోవర్ కోసం వెళ్లలేదని అనుకోవాలి. అలాగే బయోపిక్ లో మోక్షజ్ఞ కనిపించే అవకాశం కూడా లేదని అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: