ఈ మద్య బుల్లితెరపై నటించిన వారు అదృష్టం కలిసి వచ్చి వెండితెరపై కూడా నటిస్తూ తమ సత్తా చాటుతున్నారు.  జబర్ధస్త్ కామెడీ షో తో పరిచయం అని వారు అంతా ఇప్పుడు వెండి తెరపై మంచి కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.  వేణు మాధవ్, ధన్ రాజు, తాగుబోతు రమేష్ ఇలా ఎంతో మంది కమెడియన్లు సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్నారు.  ఇక షకలక శంకర్ అయితే ఏకంగా శంభో శంకర లో హీరోగా నటించారు.
Image result for shailaja reddy alludu
  త్వరలో కేడీ నెం.1 గా రాబోతున్నాడు.  అయితే ఓ ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన సింగర్ మంగ్లీ ఇప్పుడు ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలో మంచి   హుషారైన పాట పడిందట. . తెలంగాణ జానపద గీతాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె..తాజాగా సినిమా పాట పాడడం జరిగింది.  ఆ మద్య ఫిదా సినిమాలో మధు ప్రియ పాడిన పాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. 
Image result for shailaja reddy alludu
అంతే కాదు అదే ఛానల్ తో పరిచయం అయిన బిత్తిరి సత్తి సైతం సినిమాల్లో రాణిస్తున్నాడు.  ఇక  గోపీసుందర్ సంగీత దర్శకత్వంలో తయారైన ఈపాట హైలైట్ గా ఉండబోతుందట. కాకపోతే ఇది డ్యూయేట్ సాంగ్ కాదు..మాంటేజ్ సాంగ్ అని తెలుస్తుంది. అటు అత్త రమ్యకృష్ణ, ఇటు ప్రియురాలు అను ఇమ్మాన్యుయేల్ కు నడుమ హీరో నాగచైతన్య నలిగిపోతుంటే, ఆ నేపథ్యంలో వచ్చే సరదా సాంగ్ అని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: