తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన మహానటులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్).  ఇండస్ట్రీలో ఆయనకోసమే పాత్రలు పుట్టాయా అన్నంత గొప్పగా ఏ పాత్రలో  నటించినా ఆ పాత్రకు వన్నె తెచ్చేవారు.   అప్పట్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ లాగే ఉండేవారా అన్నంత గొప్పగా ఆ పాత్రకు జీవం పోసేవారు ఎన్టీఆర్.  అంతే కాదు చాలా మంది తెలుగు అభిమానులు దేవుళ్ల ఫోటోల వద్ద రాముడు, కృష్ణుడు రూపాల్లో ఎన్టీఆర్ ఫోటోలే పెట్టుకునేవారట. 
Image result for ntr biopic
పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి నటసార్వభౌముడిగా బిరుదు పొందారు.  ఎన్టీఆర్ ఒక్క సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా చరిత్ర సృష్టించారు.  తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి తెలుగు దేశం పార్టీ స్థాపించి పల్లె పల్లెనా రాజకీయాలు అంటే ఎంటో తెలియజేసేలా చేశారు. ఈ చిత్రంలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్న విషయం తెలిసిందే. 
Image result for ntr biopic
అంత గొప్ప వ్యక్తి గురించి మరిన్న విషయాలు తెలియజేసేందుకు  ప్రముఖ దర్శకులు క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ  ‘ఎన్టీఆర్’బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రేపు ఆగస్టు 15 సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.  అచ్చం ఎన్టీఆర్ ని చూసినట్లు ఉందని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: