ఫిలిం ఇండస్ట్రీలో ఒక క్రేజీ హీరో సోదరులకు అదేవిధంగా అతడి చుట్టాలకు స్నేహితులకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఏ విషయం పై అయినా చాల విభిన్నంగా మాట్లాడుతూ తన రూట్ వేరు అని అనుక్షణం చెప్పడానికి  ప్రయత్నించే విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండ పై అసహనంతో చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. 
Vijay Devarakonda Throws Surprise Party For Fans
ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే ఈరోజు విడుదలైన ‘గీత గోవిందం’ మూవీని ప్రమోట్ చేస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో విజయ్ కు మీడియా వర్గాల నుండి విజయ్ కు ఒక అనుకోని ప్రశ్న ఎదురైంది. తన సోదరుడు ఆనంద్ దేవరకొండ ఫిలిం ఎంట్రీ గురించి వివరాలు చెప్పమని ఒక మీడియా సంస్థ ప్రతినిధి అడిగినప్పుడు విజయ్ ఆప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తన సోదరుడునే అడగమని కొద్దిగా అసహనంతో సమాధానం ఇచ్చాడు. 
Vijay-Devarakonda-to-Come-After-the-Storm-Subsides
ఆనంద్ దేవరకొండను హీరోగా చేసి రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ‘దొరసాని’ అన్న మూవీని మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపధ్యంలో ఉండే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈమూవీని తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలుసుకోవడానికి ఒక మీడియా సంస్థ ప్రతినిధి విజయ్ దేవరకొండను అడిగినప్పుడు విజయ్ ఇలా అసహనం ప్రదర్సిమ్చినట్లు తెలుస్తోంది.అయితే ఫిలిం ఇండస్ట్రీలో కుటుంబ సభ్యులు వారసుల హవా రోజురోజుకి పెరిగిపోతున్న నేపధ్యంలో విజయ్ ఇలా ఎందుకు స్పందించాడు అని మీడియా వర్గాలు ఆశ్చర్యపోయినట్లు టాక్. ఈరోజు ఒక మీడియా ఇంటర్వ్యూలో విజయ్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన తల్లితండ్రులు చెప్పిన మాటను కూడ తాను వినను అంటూ గర్వంగా చెపుతున్న విజయ్ మనస్తత్వం అర్ధం కావడానికి ఇండస్ట్రీకి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: