తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అరవింద సమేత’.  ఈ చిత్రం మొదటి నుంచి భారీ అంచనాలు పెంచుకుంటూ వస్తుంది.  కాకపోతే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని లీకేజీలు వరుసగా రావడంతో చిత్ర యూనిట్ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుంది.  ఈ నేపథ్యంలో ‘అరవింద సమేత’కు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. 


ఫస్టాఫ్ లో కాలేజ్ స్టూడెంట్ గా మంచి ఎంట్రటైన్ మెంట్ గా సాగుతుందట..సెకండ్ ఆఫ్ లో ఫ్యాక్షన్ గొడవలు..సెంటిమెంట్, ఎమెషన్స్ భారీ యాక్షన్స్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు సమాచారం.  కొద్ది సేపటి క్రితం ఈ చిత్రానికి సంబందించి టీజర్ రిలీజ్ చేశారు.  ఈ టీజర్ లో జగపతిబాబు డైలాగ్స్ తో ఎన్టీఆర్ కత్తిపట్టుకొని కదన రంగంలోకి దూకుతున్నట్లు కనిపిస్తున్నాడు.  ఇక ఎన్టీఆర్ సీరియస్ గా  ‘ కంటబడ్డావా..కనికరిస్తానేమో..ఎంట బడ్డానా..నరికేస్తా బా’ అంటూ డైలాగ్ కొడుతున్నాడు.  చివరకిగా రౌడీలను చిరుత తరుముతున్నట్లు తరుకుంటూ వస్తున్నాడు..ఇక్కడ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్స్ తో కనిపిస్తున్నాడు.  దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.


మొదటి సారిగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా..అందులోనూ మాటల మాంత్రికుడి పంచ్ డైలాగ్స్..ఎన్టీఆర్ నోటి వెంట వస్తుంటే..థియేటర్లో అభిమానులు పండుగ చేసుకోవాల్సిందే.  రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో ఉండబోతుందని టీజర్ చూస్తుంటే  తెలుస్తుంది.  ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో జగపతి బాబు, నాగబాబు నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: